ఇండోనేసియా బ్యాడ్మింటన్ టోర్నీలో క్వార్టర్‌ఫైనల్లో ప్రవేశించింది భారత స్టార్ షట్లర్ పీవీ సింధు.గురువారం హోరాహోరీగా సాగిన ప్రిక్వార్టర్స్ మ్యాచ్‌లో నాలుగో సీడ్ సింధు 23–21, 20–22, 21–11తో గ్రెగోరియా మరిస్క టుంజుంగ్ (ఇండోనేసియా)పై చెమటోడ్చి గెలిచింది. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 30వ స్థానంలో ఉన్న స్థానిక క్రీడాకారిణి గ్రెగొరియా సొంత ప్రేక్షకుల మధ్య సింధుకు తొలి రెండు గేమ్‌లలో గట్టి పోటీనిచ్చింది. తొలి గేమ్ ఆరంభంలో దూకుడుగానే ఆడిన భారత స్టార్ 10-5తో సులభంగా గేమ్ గెలిచేలా కనిపించింది.…
ఆల్ ఇంగ్లండ్ చాంపియన్‌షిప్‌లో భారత యువ షట్లర్ లక్ష్యసేన్‌కు నిరాశ ఎదురైంది. 10-21, 15-21 తేడాతో టాప్‌సీడ్ విక్టర్ అక్సెల్‌సెన్ చేతిలో ఓటమిపాలయ్యాడు. 53 నిమిషాల పాటు జరిగిన తుది పోరులో అక్సెల్‌సెన్‌కు దీటైన పోటీనివ్వడంలో విఫలమయ్యాడు. ఇటీవల జరగిన జర్మనీ ఓపెన్‌లో ఈ డెన్మార్క్ షట్లర్‌ను మట్టికరిపించిన సేన్.. మరోమారు ఆ స్థాయి ప్రదర్శన కనబరుస్తాడని ఆందరూ ఊహించారు. కానీ, అక్సెల్‌సన్ ఎక్కడా అవకాశమివ్వకుండా చెలరేగాడు. తన అనుభవన్నంతా రంగరిస్తూ డ్రాప్ షాట్లు, పదునైన స్మాష్‌లతో…
భారత యువ షట్లర్ లక్ష్యసేన్ చరిత్ర సృష్టించాడు. ఇండియా ఓపెన్ 2022లో ఆదివారం జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో సింగపూర్ ఆటగాడు, వరల్డ్ ఛాంపియన్ లొహ్ కియన్ యూని 24-21, 21-17 స్కోరు తేడాతో ఓడించాడు. లక్ష్యసేన్‌కు ఇదే తొలి టైటిల్. అంతేకాకుండా ఈ టైటిల్‌ను గెలుచుకున్న మూడో భారత పురుష ఆటగాడిగా లక్ష్యసేన్ నిలిచాడు. అతని కంటే ముందు 1981లో ప్రకాష్ పదుకొణె, ఆ తర్వాత 2015లో కిదాంబి శ్రీకాంత్ తొలి సూపర్ 500 ఛాంపియన్‌షిప్ టైటిల్‌ను…