Lakshya Sen: నెరవేరని లక్ష్యసేన్ కల..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆల్ ఇంగ్లండ్ చాంపియన్‌షిప్‌లో భారత యువ షట్లర్ లక్ష్యసేన్‌కు నిరాశ ఎదురైంది. 10-21, 15-21 తేడాతో టాప్‌సీడ్ విక్టర్ అక్సెల్‌సెన్ చేతిలో ఓటమిపాలయ్యాడు. 53 నిమిషాల పాటు జరిగిన తుది పోరులో అక్సెల్‌సెన్‌కు దీటైన పోటీనివ్వడంలో విఫలమయ్యాడు. ఇటీవల జరగిన జర్మనీ ఓపెన్‌లో ఈ డెన్మార్క్ షట్లర్‌ను మట్టికరిపించిన సేన్.. మరోమారు ఆ స్థాయి ప్రదర్శన కనబరుస్తాడని ఆందరూ ఊహించారు. కానీ, అక్సెల్‌సన్ ఎక్కడా అవకాశమివ్వకుండా చెలరేగాడు. తన అనుభవన్నంతా రంగరిస్తూ డ్రాప్ షాట్లు, పదునైన స్మాష్‌లతో కీలక పాయింట్లు ఖాతాలో వేసుకున్నాడు. తన కంటే మెరుగైన ర్యాంక్‌లో ఉన్న ప్లేయర్‌కు దీటైన పోటీనిచ్చే క్రమంలో సేన్ తడబడ్డాడు.
Read Also: AP Assembly: స్పీకర్‌కు టీడీపీ ఎమ్మెల్యేల లేఖ..
Also Read
- Ind vs Afg: సంజూ శాంసన్ ఉగ్రరూపం.. కొడితే సిక్స్ పోవాల్సిందే.. దూకుడే దూకుడు..
- ICC Rankings: ఆసియా కప్ దెబ్బకు ఐసీసీ ర్యాంకింగ్స్ తారుమారు.. టాప్‌లోకి దూసుకెళ్లిన ఇండియన్ ప్లేయర్స్..
- IND vs WI 2026: మూడు వన్డేలు, 5 టీ20 మ్యాచ్‌ల షెడ్యూల్ విడుదల.. సెప్టెంబర్ 27 నుంచే..
- Vaibhav Sooryavanshi: వైభవ్‌ను పక్కనపెట్టడం ఏంటో.. బుమ్రా ఎందుకు ఆడుతున్నాడో.. బీసీసీఐకి పాక్ మాజీ స్టార్ కౌంటర్!
తొలి గేమ్‌లో 0-6తో వెనుకంజలో నిలిచిన లక్ష్యసేన్.. మళ్లీ కోలుకోలేకపోయాడు. ఆ తర్వాత పుంజుకున్నట్లు కనిపించినా.. అక్సెల్‌సన్ ఏమాత్రం అవకాశమివ్వలేదు. వరుస పాయింట్లతో ముందంజ వేశాడు. అదే జోరులో తొలి గేమ్‌ను 21-10ను కైవసం చేసుకున్నాడు. అయితే, కీలకమైన రెండో గేమ్‌లో విక్టర్‌కు 4-4తో సమాధానమిచ్చిన లక్ష్యసేన్.. దాన్ని నిలబెట్టుకోలేకపోయాడు. వరుసగా నాలుగు పాయింట్లతో అక్సెల్‌సన్ తన ఆధిక్యాన్ని 8-4కు పెంచుకున్నాడు. ఆతర్వాత కూడా ఏమాత్రం వెనుకకు తగ్గని అక్సెల్‌సెన్ గేమ్‌తో పాటు మ్యాచ్‌ను సొంతం చేసుకున్నాడు.
తాజావార్తలు
-
Ind vs Afg: సంజూ శాంసన్ ఉగ్రరూపం.. కొడితే సిక్స్ పోవాల్సిందే.. దూకుడే దూకుడు..
-
OTR: చిన్నశ్రీను గోవా టూర్ ప్యాచ్ వర్కేనా? అశోక్ గజపతి రాజుతో భేటీ వెనుక అసలు కథ..
-
OTR: చిన్నారెడ్డి పెద్ద ప్లానే వేశారా..? సీక్రెట్ మీటింగ్‌లో ఏం మాట్లాడుకున్నారు..?
-
OTR: కొండా దంపతుల విషయమై సొంత కేడర్ లో గందరగోళం
-
Tirupati Corporation: తిరుపతి కార్పొరేషన్లో పెరిగిన వార్డులు.. 50 నుంచి 66కి పెంపు..
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?