Lakhimpur Kheri Case: దేశవ్యాప్తంగా సంచలన సృష్టించి, రాజకీయ దుమారానికి కారణం అయిన లఖీంపూర్ ఖేరీ రైతుల హత్య కేసులో నిందితుడిగా అభియోగాలు ఎదుర్కొంటున్న కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రాకు సుప్రీంకోర్టు 8 వారాలు బెయిల్ మంజూరు చేసింది. తన బెయిల్‌ను తిరస్కరిస్తూ అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టులో ఆశిష్ మిశ్రా సవాలు చేశారు. దీనిపై విచారణ జరిపిన అత్యున్నత న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది. నేరం రుజువైతే తప్పా నిందితుడిని…
Union minister Ajay mishra Controversial comments on Farmers:కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వివాదాస్పదం అవుతున్నాయి. తన కార్యకర్తలతో మాట్లాడుతూ.. చేసిన వ్యాఖ్యలపై ప్రతిపక్షాలతో పాటు రైతు సంఘాలు మండిపడుతున్నాయి. ఆందోళన చేస్తున్న రైతులన్ని కుక్కలతో పోల్చడంతో పాటు.. రైతు నేత రాకేష్ టికాయత్ ను బీ గ్రేడ్ వ్యక్తిగా అభివర్ణించారు.
లఖింపూర్ ఖేరీ కేసులో ఆశిష్ మిశ్రాకు బెయిల్‌ను రద్దు చేసింది సుప్రీంకోర్టు… అలహాబాద్ హైకోర్టు ఆశిష్‌మిశ్రాకు బెయిల్ మంజూరు చేస్తూ ఇచ్చిన ఉత్తర్వులను సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఇదే సమయంలో.. వారం రోజుల్లోగా లొంగిపోవాలని ఆశిష్ మిశ్రాను ఆదేశాలు జారీ చేసింది అత్యున్నత న్యాయస్థానం… అలహాబాద్ హైకోర్టు ఆదేశాలను పక్కన పెడుతూ, లఖింపూర్ ఖేరీ హింసాకాండ నిందితుడు ఆశిష్ మిశ్రాకు మంజూరైన బెయిల్‌ను సుప్రీంకోర్టు రద్దు చేసింది.. కాగా, ఈ కేసులో అలహాబాద్ హైకోర్టు మిశ్రాకు బెయిల్ మంజూరు…
ఉత్తరప్రదేశ్‌లోని లఖింపూర్ ఖేరీలో హింసాత్మక ఘటనలపై సుప్రీంకోర్టు ఇవాళ మరోసారి విచారణ జరపనుంది. ఈ ఘటనపై దసరా పండగ ముందు విచారణ జరిపిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్‌వి రమణ ధర్మాసనం.. యూపీ ప్రభుత్వం చేపట్టిన చర్యలపై అసంతృప్తి వ్యక్తం చేసింది. దయచేసి విచారణకు హాజరుకండి అంటూ నిందితుడికి సీఆర్‌పీసీ-160 కింద పోలీసులు నోటీసులు ఇవ్వడాన్ని తప్పు పట్టింది. మిగతా కేసుల్లో నిందితుల విషయంలోనూ ఇలాగే వ్యవహరిస్తారా? అని నిలదీసింది. కాగా, లఖింపూర్ ఉద్రిక్తతల్లో నలుగురు రైతులు…
ఉత్తరప్రదేశ్‌లోని లఖింపుర్ ఖేరి ఘటనపై మరోసారి విచారణ జరిపిన సుప్రీంకోర్టు.. యూపీ సర్కార్ తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది… యూపీ సర్కార్ చేపట్టిన చర్యలపై అసంతృప్తి వ్యక్తం చేసిన సుప్రీంకోర్టు సీజేఐ ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం.. నిందితులను ఇప్పటి వరకు ఎందుకు అరెస్టు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేసింది.. ఈ ఘటనపై దసరా తర్వాత తదుపరి విచారణ చేపట్టనున్నట్టు వెల్లడించిన సుప్రీంకోర్టు.. అయితే, అప్పటి వరకు అన్ని సాక్ష్యాలను పరిరక్షించాలని యూపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది.…