అప్పుడప్పుడు వడగళ్ళవాన పడడం కామన్. కానీ కొన్ని ప్రాంతాల్లో చేపల వాన కురవడం మనం అరుదుగా వింటుంటాం. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో నిజంగానే చేపల వర్షం కురిసింది. సోమవారం వేకువజామున ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. తెల్లవారు జామున భారీ వర్షం కురవడంతో కాళేశ్వరం పల్గుల బైపాస్ రోడ్డు కాలనీలో విచిత్రం చోటుచేసుకుంది. అక్కడే వున్న కొందరి ఇళ్ళ పరిసరాలలో, అటవీ ప్రాంతంలోని పడిదం చెరువు గుంతలలో చేపలు ప్రత్యక్షం అయ్యాయి. పడిదం చెరువు సమీపంలో ఉపాధి…
కర్నూలు జిల్లా, తుగ్గలి (మం) జొన్నగిరిలో వర్షాకాలం వచ్చిందంటే చాలు అక్కడ కూలీలు, సామాన్య జనాలు ఒకటే హడావిడి. వజ్రాల వేటకు బయలుదేరతారు. తాజాగా కూలీలకు రెండు వజ్రాలు దొరికాయి. పొలం పనులు చేస్తున్న ఇద్దరు కూలీలకు దొరికిన రెండు వజ్రాలను వ్యాపారులు కొనేశారు. అది కూడా తక్కువ ధరకే అని తెలుస్తోంది. ఓ వజ్రాన్ని రూ.45 వేలకు, జత కమ్మలు ఇచ్చి కొన్నట్లు సమాచారం. మరొక వజ్రాన్ని రూ.35 వేలు ఇచ్చి కొనుగోలు చేశారు వ్యాపారులు.…
కేంద్రం విడుదలచేసే నిధులు అందరికీ అందేలా కృషిచేస్తానన్నారు బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్. ఉపాధి కూలీల సొమ్ము తినే వాళ్ల లెక్క తేలుస్తానన్నారు. ఉపాధి నిధులను ఆపుతోంది కేసీఆరే. అదనంగా 50 రోజుల ఉపాధిహామీ పనిదినాలు పెంచాలని మోడీ దృష్టికి తీసుకెళ్తా. ఉపాధి కూలీ బకాయిలన్నీ ఇప్పిస్తానన్నారు. ఉపాధి హామీ కూలీలతో బండి సంజయ్ ముచ్చటించారు. వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర 19వ రోజు కొనసాగుతోంది. ధన్వాడ మండలం…