బీహార్ సీఎం నితీష్ కుమార్ తెలంగాణ సీఎం కేసీఆర్ ని ఆకాశానికెత్తేశారు. దేశ చరిత్రలో ఒకే ఒక్కడు తెలంగాణ సీఎం కేసీఆర్ అన్నారు నితీష్. ఒక రాష్ట్రం కోసం ఉద్యమించి, రాష్ట్రాన్ని సాధించి, అనతి కాలంలోనే తెలంగాణ రాష్ట్రాన్ని దేశానికి రోల్ మోడల్ గా నిలిపిన కేసీఆర్ ఒకే ఒక్కడిగా చరిత్రలో నిలిచిపోతారని బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ అన్నారు. నూతన తెలంగాణ రాష్ట్రం సాధిస్తున్న ప్రగతిని బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కొనియాడారు.
తెలంగాణలో అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు భారతదేశానికి మార్గదర్శనంగా నిలిచాయని నితీష్ కుమార్ అన్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్ గారికి అపూర్వ స్వాగతం. కేసీఆర్ ఇక్కడకి వచ్చేందుకు సమయం కేటాయిచండం చాలా సంతోషకరం.గాల్వన్ లోయ అమరవీరులకు రూ. 10 లక్షలు, హైదరాబాద్ దుర్ఘటనలో మరణించిన కార్మికులకు రూ 5 లక్షలు తెలంగాణ ప్రభుత్వం ఆర్థిక సహాయంగా అందించడం గొప్ప విషయం. తెలంగాణ ప్రభుత్వం కరోనా సమయంలో బీహార్ వాసులను తరలించేందుకు ప్రత్యేక ట్రైన్లను ఏర్పాటు చేయడం వారి ఉదారతకు తార్కాణం. తెలంగాణ ప్రభుత్వం అమలుపరిచిన కార్యాచరణను మరే ప్రభుత్వం చేయలేదు.
తెలంగాణ ఏర్పాటు కోసం కేసీఆర్ 2001 నుంచి ఉద్యమించారు. ప్రాణాలకు తెగించి ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించారు. అనంతరం వచ్చిన ఎన్నికల్లో ప్రజల దీవెనలతో విజయం సాధించి ముఖ్యమంత్రి అయ్యారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో, వికాసంలో కేసీఆర్ గారి భాగస్వామ్యం ఎంతో గొప్పది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం ప్రాణాలకు తెగించి పోరాడి, ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించి, అనతి కాలంలోనే తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రపథంలో నిలిపిన కేసీఆర్ గారు ఒకే ఒక్కడిగా చరిత్రలో నిలిచిపోతారని ప్రశంసించారు నితీష్ కుమార్.
తెలంగాణ రాష్ట్ర ప్రగతి కోసం అహరహం శ్రమిస్తున్న గొప్ప సీఎం కేసీఆర్.మిషన్ భగీరథ పథకం గొప్ప పథకం. మిషన్ భగీరథ ద్వారా తెలంగాణలోని గ్రామ గ్రామానికి మంచినీటిని అందించడం చాలా గొప్ప కార్యం. తెలంగాణ ఇచ్చిన సీఎం ను ప్రజలు వదులుకోరు. తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన ప్రేరణతో బీహార్ లో నీటి సమస్యను త్వరలోనే అధిగమిస్తాం.ఎప్పటిదాకా వ్యవసాయోగ్యమైన భూమి, పచ్చదనం ఉంటుందో అప్పుడే సమాజం వర్ధిల్లుతుంది.ప్రజా సంక్షేమం, రాష్ట్ర ప్రగతి కోసం అసాధ్యాలను సుసాధ్యం చేయడం కేసీఆర్ గారికే సాధ్యమైందన్నారు బీహార్ సీఎం.
ప్రస్తుత పరిస్థితుల్లో కేంద్రం రాష్ట్రాలకు అందే నిధులకు కోత పెడుతున్నది. ప్రత్యేక రాష్ట్ర హోదా లభించి ఉంటే బీహార్ చాలా గొప్పగా ఉండేది. రాష్ట్రాల అభివృద్ధే దేశాభివృద్ధి అనే విషయాన్ని కేంద్రం మరిచింది. నాకు హైదరాబాద్ తో అవినాభావ సంబంధం ఉంది. అటల్ బీహార్ వాజ్ పేయ్ నేతృత్వంలో బీహార్ ప్రభుత్వం బాగా పనిచేసింది.తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ చాలా గొప్పగా అభివృద్ధి చెందుతున్నది.తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న సహాయానికి మరోమారు అభినందనలు అన్నారు నితీష్ కుమార్.
Read Also: Bangalore Rains.. Fishes in Roads: బెంగళూరులో భారీ వర్షం.. రోడ్లపై చేపల వేట