MLC Kavitha : తెలంగాణ రాష్ట్రం భౌగోళికంగా ఏర్పడినా.. సామాజికంగా సమానత్వం ఇంకా రాలేదని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వ్యాఖ్యానించారు. గురువారం మే డే సందర్భంగా ఆమె నివాసంలో ప్రత్యేక వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలు కార్మిక సంఘాల ప్రతినిధులు, కార్మికులు పాల్గొన్నారు. వారిని ఉద్దేశించి ఆమె కీలక వ్యాఖ్యలు చేశారు. రైతుబంధు కింద భూమి ఉన్న రైతులకు పెట్టుబడి సాయం అందుతోందని, కానీ భూమిలేని కార్మికుల విషయానికి వస్తే ప్రభుత్వం వైఫల్యం చెందిందని…