కువైట్ అగ్నిప్రమాదంలో మృతి చెందిన వారిలో కేరళకు చెందిన వారు ఎక్కువగా ఉన్నారు. అయితే వారి మృతదేహాలు ఈరోజు రాష్ట్రానికి వచ్చాయి. మృతదేహాలకు రాష్ట్ర ప్రజలు కన్నీటి వీడ్కోలు పలికింది. రాష్ట్రంలోని వలస సమాజాన్ని ప్రభావితం చేసిన అతిపెద్ద సంఘటనలలో ఇది ఒకటి. మరోవైపు.. బాధితుల ఇళ్లలో చోటు చేసుకున్న దృశ్యాలు హృదయ విదారకంగా మారాయి.
Kuwait Fire Accident: బతువుదెరువు కోపం పరాయి దేశం వెళ్లి, శవాలుగా తిరిగి వస్తున్న తమ వారిని చూస్తున్న కుటుంబాల కన్నీరును ఆపడం ఎవరి వల్ల కావడం లేదు. తమవారిని కాలిన మృతదేహాలుగా చూస్తామనుకోలేదని కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
Kuwait Fire Accident: గల్ఫ్ దేశం కువైట్‌లో ఘోర అగ్నిప్రమాదంలో మనదేశంలో తీవ్ర విషాదం నింపింది. మంగాఫ్ నగరంలో బుధవారం ఆరు అంతస్తుల భవనంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది.