Gujarat Titans: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2025లో గుజరాత్ టైటన్స్ (GT) మే 22న అహ్మదాబాద్‌లో నరేంద్ర మోడీ స్టేడియంలో జరగనున్న లక్నో సూపర్ జైంట్స్ (LSG)తో మ్యాచ్‌లో ప్రత్యేక లావెండర్ రంగు జెర్సీని ధరించనుంది. ఈ నిర్ణయాన్ని జట్టు సోషల్ మీడియా ద్వారా తెలిపింది. ఈ చర్య క్యాన్సర్ వ్యతిరేక పోరాటాన్ని ప్రోత్సహించడానికి సంబంధించినట్లు వివరించింది. గతంలో కూడా గుజరాత్ టైటన్స్ ఇలాంటి సామాజిక బాధ్యతా కార్యక్రమాల్లో భాగంగా లావెండర్ జెర్సీతో అనేక సార్లు…
ఐపీఎల్ 2025 ప్లేఆఫ్స్‌కు గుజరాత్ టైటాన్స్ ఆటగాడు జోస్ బట్లర్ దూరం కానున్నాడు. జాతీయ జట్టు (ఇంగ్లండ్) తరఫున మ్యాచ్‌లు ఆడేందుకు మే 26న అతడు స్వదేశానికి వెళ్లనున్నాడు. చెన్నై సూపర్ కింగ్స్‌తో గుజరాత్ చివరి లీగ్ మ్యాచ్ అనంతరం బట్లర్ ఇంగ్లండ్ పయనం కానున్నాడు. ఇప్పటివరకు ఆడిన 11 మ్యాచ్‌ల్లో 8 విజయాలతో గుజరాత్ ఇప్పటికే దాదాపుగా ప్లేఆఫ్స్ బెర్తును ఖాయం చేసుకుంది. కీలక ప్లేఆఫ్స్‌కు బట్లర్ దూరం కావడం జీటీకి గట్టి ఎదురుదెబ్బే అని…