Kusal Mendis: అత్యంత చెత్త రికార్డ్.. టోటల్‌గా 26
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sri Lankan Cricketer Kusal Mendis Creates Worst Record In International Cricket: శ్రీలంక బ్యాటర్ కుశాల్ మెండిస్ అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యంత చెత్త రికార్డ్ క్రియేట్ చేశాడు. ఆసియా కప్‌లో భాగంగా ఆదివారం పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో అతడు గోల్డెన్ డక్‌గా వెనుదిరిగాడు. దీంతో కలిపి అతడు ఇప్పటివరకూ 26 సార్లు డకౌట్ అయ్యాడు. ఫలితంగా.. అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక డకౌట్లు అయిన క్రికెటర్ల జాబితాలో అతడు రెండో స్థానంలో నిలిచాడు. మొదటి స్థానంలో జానీ బెయిర్ స్టో (ఇంగ్లండ్) 27 డకౌట్లతో ఉన్నాడు. 25 డకౌట్లతో మొయిన్ అలీ (ఇంగ్లండ్) మూడో స్థానంలో ఉండగా.. 23 డకౌట్లతో కగిసో రబాడా (సౌతాఫ్రికా) నాలుగో స్థానంలో ఉన్నాడు. కుశాల్ మెండిస్ మరో రెండు సార్లు డకౌట్ అయితే.. బెయిర్ స్టోని అధిగమించి, అగ్రస్థానంలో నిలుస్తాడు.
ఇక మ్యాచ్ విషయానికొస్తే.. ఆసియా కప్ ఫైనల్‌లో పాకిస్తాన్‌పై శ్రీలంక ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన లంక జట్టు.. రాజపక్స ఆడిన విధ్వంసకరమైన ఇన్నింగ్స్ పుణ్యమా అని 170 పరుగులు చేయగలిగింది. అటు పాకిస్తాన్ ఆటగాళ్లు కూడా చేతికి అందివచ్చిన రెండు క్యాచ్‌లు వదులుకొని, అతనికి లైఫ్ ఇచ్చారు. నిజానికి.. మొదటి పది ఓవర్లను పాక్ బౌలర్లు పటిష్టంగా వేశారు. ఐదు వికెట్లు తీసి, కేవలం 67 పరుగులే ఇచ్చారు. కానీ, ఆ తర్వాతే పరిస్థితులు తేడా కొట్టేశాయి. రాజపక్సకి అవకాశాలు ఇవ్వడంతో, అతడు చెలరేగిపోయాడు. అటు.. లక్ష్య చేధనకు దిగిన పాక్ బ్యాటర్లు సైతం సత్తా చాటుకోలేకపోయారు. ఓపెనర్ మహమ్మద్ రిజ్వాన్ (55), మిడిలార్డర్‌లో వచ్చిన ఇఫ్తికార్ అహ్మద్ (31) మాత్రమే రాణించారు. మిగతా వాళ్లంతా చేతులెత్తేశారు. దాంతో 147 పరుగులకే పాక్ జట్టు కుప్పకూలింది.
Also Read
- Vaibhav Sooryavanshi: ‘నేను ఏం తప్పు చేశా..?’.. కోపంతో రగిలిపోతున్న వైభవ్ సూర్యవంశీ..
- SKY: సూర్యకుమార్ యాదవ్ 36వ పుట్టినరోజు.. 'మిస్టర్ 360' అరుదైన రికార్డుల ప్రయాణం ఇలా..
- Asia Cup Trophy Row: అది ప్లేయర్స్ నిర్ణయం కాదు.. బీసీసీఐది!
- Ajit Agarkar-BCCI: బీసీసీఐ కీలక సమావేశం.. అజిత్ అగార్కర్ భవిష్యత్తుపై ఉత్కంఠ!
తాజావార్తలు
-
Stock Markets Crash: గ్లోబల్ మార్కెట్లలో రక్తకన్నీరు.. భారత్‌కి కలిసొచ్చిన సెలవు.. లేదంటే భారీ నష్టాలే!
-
Nandigram Bypoll: ఉద్యోగం కోల్పోయిన టీచర్.. నందిగ్రామ్ పోరులో మమతా బెనర్జీ అభ్యర్థి..
-
CM Vijay: త్రిషతో కలిసి విదేశాల్లో తిరుగుతారా? సీఎం విజయ్‌పై విపక్షాలు ధ్వజం
-
Iran War: విమానం కూలింది.. ఎముకలు విరిగాయి.. అయినా వెనక్కి తగ్గలేదు.. ఇరాన్లో అమెరికా సైనికుడి పోరాటం
-
Vaibhav Sooryavanshi: ‘నేను ఏం తప్పు చేశా..?’.. కోపంతో రగిలిపోతున్న వైభవ్ సూర్యవంశీ..
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!