కర్నూలు జిల్లాలో నందికొట్కూరు మండలం బ్రహ్మణ కొట్కూరు వద్ద హంద్రీనీవా ప్రధాన కాలువను నేషనల్ హైవే కాంట్రాక్టర్ పూడ్చేశారు. శ్రీశైలం జలాశయం నిండినా హంద్రీనీవా కాలువకు నీరు విడుదల చేయలేని పరిస్థితి ఏర్పాడింది. కర్నూలు- ఆత్మకూరు మధ్య నేషనల్ హైవే నిర్మాణంలో భాగంగా వంతెన నిర్మాణానికి హంద్రీనీవా కాలువను సదరు కాంట్రాక్టర్ పూడ్చి వేసేశారు.
పూర్వీకుల నుండి వస్తున్న సంప్రదాయాన్ని కొనషించాలని ఉద్దేశంతో గుర్రపు స్వారీ నేర్చుకునేందుకు సిద్ధమయ్యాడు పృథ్వీరాజ్ రాముడు అనే యువకుడు.. కానీ, గుర్రం పరుగులు తీయడం.. అదుపుతప్పి కిందపడి ప్రాణాలు పోగొట్టుకున్నాడు..
కర్నూల్‌లో 25వ సత్యా షోరూంను ఘనంగా ప్రారంభించారు. భవన యజమాని మకం నాగశేషు రిబ్బన్ కట్ చేసి షోరూంను ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవంలో సత్యా షోరూంల ఏపీ హెడ్ సెంథిల్‌లో పాటు పలువురు పాల్గొన్నారు.
9th Class Girl Murder: కర్నూలు జిల్లాలోని ముచ్చుమర్రిలో అత్యాచారం, హత్యకు గురైన బాలిక మృతదేహం కోసం 4వ రోజు కూడా పోలీసులు గాలింపు కొనసాగిస్తున్నారు. ఎన్డీఆర్ ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు, స్థానిక మస్థ్యకారుల సహాయంతో కలిసి వెతుకుతున్నారు. జులై 7వ తేదీ నుంచి బాలిక కనిపించకుండా పోయింది.
Leopard Roaming In Mahanandi : నంద్యాల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన మహానందిలో చిరుత గత 22 రోజులుగా తిరుగుతూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తుంది. చిరుత సంచారానికి సంబంధించిన సిసిటీవీ ఫోటేజీలలో కూడా చాలానే మీడియా ద్వారా బయటికి వచ్చాయి. 22 రోజులుగా మహానంది పుణ్యక్షేత్రం చుట్టూ చిరుత చక్కర్లు కొడుతుండడంతో భక్తులు భయభ్రాంతులకు గురవుతున్నారు. అయితే చిరుతను బంధించడానికి అటవీ శాఖ అధికారులు అనేక మార్గాలను చేస్తున్నారు. మహానందిలోని విద్యుత్ సబ్ స్టేషన్, అన్నదాన సత్రం,…
మున్సిపల్ కార్పొరేషన్ అధికారులతో మంత్రి టీజీ భరత్ సమీక్ష సమావేశం నిర్వహించారు. కర్నూలులో పారిశుధ్యం, మౌలిక సౌకర్యాల అభివృద్ధి, పచ్చదనంపై మంత్రి భరత్ అధికారులను ఆరా తీశారు. ఆక్రమణల తొలగింపులో తొందరపాటు వద్దని మంత్రి సూచించారు.
ఆంధ్రప్రదేశ్లో వర్షాలు మొదలయ్యాయి సాధారణంగా వేసవి కాలం తర్వాత జూన్ నెలలో కురిసే తొలకరి వానల కోసం జనాలు ఎదురు చూస్తారు. కానీ ఈసారి మాత్రం వర్షాలు త్వరగా కురుస్తున్నాయి.. దీంతో కర్నూలు జిల్లాలో వజ్రాల వేట కొనసాగిస్తున్నారు. కర్నూల్ జిల్లా తుగ్గలి మండలం జొన్నగిరి లో పత్తికొండకి చెందిన ఒక వ్యక్తికి వజ్రం దొరికింది. దాన్ని వజ్రాల వ్యాపారవేత్త 2 లక్షల క్యాష్ మరియు 2 తులాల బంగారం ఇచ్చి కొనుగోలు చేసారు. అయితే వజ్రం…