తెలుగు రాష్ట్రాల్లో భానుడి తాపానికి ప్రజలు అల్లాడుతున్నారు. ఎండలు మండిపోతుండటంతో బయటకు రావాలంటేనే జంకుతున్నారు. తప్పని సరి అయితే తప్ప బయటకు వచ్చే పరిస్థితి కనిపించడం లేదు.
కర్నూలు జిల్లా కూటమిలో మంటలు చల్లారడం లేదు. కూటమిలో విభేదాలు తారాస్థాయికి చేరాయి. ఎమ్మిగనూరు, మంత్రాలయంలో టీడీపీతో మిత్రపక్షాలు ఢీకొట్టే పరిస్థితులు కనిపిస్తున్నాయి.
తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ మంత్రి, ప్రస్తుతం నంద్యాల టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అయిన ఎన్ఎండి ఫరూక్ కు పెను ప్రమాదం తప్పింది. నంద్యాల నుండి కర్నూలు వైపుకు వెళుతున్న ఆయన తృటిలో పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. నంద్యాల నుండి కర్నూల్ వైపు వెళ్తున్న సమయంలో తమ్మరాజు పల్లె వద్ద కారు అదుపుతప్పి గేదెలను ఢీ కొట్టింది. అయితే అదృష్టం కొద్దీ కారులో ఉన్న ఎయిర్ బెలూన్స్ సమయానికి ఓపెన్ కావడంతో ఆయనకు పెను ప్రమాదం…
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలులో పోలీసులు రెచ్చిపోయారు. ఓ కార్పొరేటర్, మరో కార్పొరేటర్ కుమారుడిని చితకబాదారు. దుస్తులు విప్పి.. లాఠీలతో కొట్టి.. కాళ్ళతో తొక్కి హింసించారు. ఎన్నికల సమావేశం ఉందని పిలిపించి ఇద్దరినీ పోలీసులు చావబాదారు. ఎలాంటి కేసులు లేకున్నా థర్డ్ డిగ్రీ ఉపయోగించారు. ఈ ఘటనపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయనున్నారు. Also Read: 2019 World Cup: 2019 ప్రపంచకప్ ఫైనల్‌లో తప్పిదం చేశాం.. ఇంగ్లండ్ కప్ గెలిచేదే కాదు! అంపైర్ సంచలన వ్యాఖ్యలు వివరాల ప్రకారం……
డిజిటల్ ఇండియా కాన్సెప్ట్ ఎంతగా జనాలకు మేలు చేస్తుందో అంతే కీడు చేస్తుంది. డిజిటల్ ట్రాన్సాక్షన్స్ ప్రాచుర్యం పొందాక ఆన్‌లైన్ మోసాలు విపరీతంగా పెరిగాయి. సైబర్ నేరగాళ్లు ఎప్పటికప్పుడు సాంకేతికత అభివృద్ధి చేసుకుంటూ, మోసపూరిత చర్యలకు పాల్పడుతున్నారు.
కర్నూలు జిల్లాలోని కోసిగి మండలం జంపాపురంలో దారుణం చోటు చేసుకుంది. తన మూడేళ్ళ చిన్నారిని ఓ కసాయి తండ్రి శాంతి కుమార్ గొంతు కోసి చంపేశాడు. ఇవాళ తెల్లవారు జామున తల్లి పక్కన నిద్రిస్తున్న సమయంలో కత్తితో గొంతు కోసి ఆ పాసికూనను హతమార్చాడు.
Kurnool MP Seat: కర్నూలు ఎంపీ అభ్యర్థిపై ఈరోజు వైసీపీ అధిష్టానం తుది నిర్ణయం తీసుకోనుంది. కర్నూలు మేయర్ బీవై రామయ్యను ఇప్పటికే తాడేపల్లి సీఎం క్యాంపు ఆఫీసుకు వైసీపీ అధిష్టానం పిలిపించింది. కర్నూలు ఎంపీ అభ్యర్థిగా బీవై రామయ్య పేరును ఇప్పటికే ఖరారు చేసింది. మంత్రి జయరాంను ఎంపీ అభ్యర్థిగా ప్రకటించినా.. ఆయన నిరాకరించడంతో బీవై రామయ్య పేరును అధిష్టానం ఖరారు చేసింది. ఈరోజు సీఎం వైఎస్ జగన్ను కర్నూలు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎంపికైన…