కరోనా కారణంగా పెళ్లిళ్లు కుడా ఆన్‌లైన్‌లో చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. కర్నూల్‌కు చెందిన రజిత, నల్గొండకు చెందిన దినేశ్‌రెడ్డిల వివాహం కర్నూలు లోని ఓ ఫంక్షన్ హాల్లో ఆన్ లైన్ లో జరిగింది. రజిత, దినేష్‌రెడ్డిలకు రెండేళ్ల క్రితం వివాహం జరిపించాలని ఇరుకుటుంబాల పెద్దలు నిర్ణయించారు. అమ్మాయి, అబ్బాయి ఉద్యోగరీత్యా ఆస్ట్రేలియాలోని డింబోలలో ఉంటున్నారు. కరోనా కారణంగా వీరి వివాహం వాయిదా పడుతూ వచ్చింది. ప్రస్తుతం ఆస్ట్రేలియా నుండి ఇండియాకు వచ్చే పరిస్థితి లేకపోవడంతో ఆన్‌లైన్‌లోనే వివాహం…
విచ్చలవిడిగా అక్రమ మైనింగ్ జరుగుతోందని.. ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారంటూ ఫైర్ అయ్యారు మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత భూమా అఖిలప్రియ… ఇవాళ మీడియాతో మాట్లాడిన ఆమె.. రాష్ట్రంలో విచ్చలవిడిగా అక్రమ మైనింగ్ జరుగుతోందని.. ప్రశ్నించిన వారిపై అక్రమ కేసులు పెట్టడం సిగ్గుచేటని మండిపడ్డారు.. ఆళ్లగడ్డ మండలం ఆర్ క్రిష్ణాపురంలో వైసీపీ నేతలు ఎర్రమట్టి దందా సాగిస్తున్నారన్న ఆమె.. పుల్లయ్య అనే వ్యక్తి పేరు మీద ఎకరాకు పర్మిషన్ తీసుకొని… మరికొన్ని ఎకరాల్లో ఎర్రమట్టి తవ్వుతున్నారని.. ఆళ్లగడ్డ…
ప్రజల కష్టాలు, ప్రాంతం సమస్యల కంటే వారికి సొంత వ్యాపారాలు.. ఆస్తులే ఎక్కువ అయ్యాయా? తీవ్ర నష్టం చేకూర్చే చర్యలు జరుగుతోన్నా.. అధినేతను విమర్శిస్తున్నా నోరెత్తకపోవడానికి కారణం అదేనా? సీమకు ప్రాణాధారమైన రాయలసీమ లిఫ్ట్.. RDS కుడి కాల్వలకు తెలంగాణ అడ్డుపడినా కర్నూలు నేతలు స్పందించకపోవడానికి అవే కారణాలా? జల జగడంపై పెదవి విప్పని కర్నూలు వైసీపీ నేతలు! రాయలసీమ ఎత్తిపోతల పథకం, RDS కుడి కాలువ పనులు తెలుగు రాష్ట్రాల మధ్య నిప్పుల వర్షం కురిపిస్తున్నాయి.…
తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదం ముదురుతోన్న సమయంలో.. చర్చలకు సిద్ధమైంది భారతీయ జనతా పార్టీ.. ఎల్లుండి కర్నూలులో రాయలసీమ స్థాయి సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు.. రాయలసీమ పదాధికారులు, ఎనిమిది జిల్లాల పార్టీ అధ్యక్షులు హాజరుకానున్నారు. రాయలసీమలో నీటిపారుదల ప్రాజెక్టులపై ఈ సమావేశంలో చర్చ జరగనుంది. రాయలసీల ఎత్తిపోతల పథకం, ఆర్డీఎస్ కుడికాలువ, గుండేగుల, వేదవతి ప్రాజెక్టులపై బీజేపీ నేతలు చర్చించనున్నారు.. ప్రాజెక్టుల అంశంలో భవిష్యత్ కార్యక్రమాన్ని కూడా…
కర్నూలు పెసరవాయి జంట హత్య కేసులో 9 మంది నిందితులను అరెస్టు చేసారు. రాజా రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, కేధార్ నాద్ రెడ్డి తో పాటు మరో ఆరుమందిని అరెస్టు చేసి వారిని నంద్యాల కోర్టుకు తరలించారు పోలీసులు. ఈనెల 17న గడివేముల మండలం పెసరవాయిలో హత్యకు గురైన టీడీపీ నేతలు వడ్డు నాగేశ్వర రెడ్డి, వడ్డు ప్రతాప్ రెడ్డిలను రెండు వాహనాలతో ఢీకొట్టి వేటకొడవళ్ళతో నరికి చంపారు నిందితులు. గ్రామంలో అధిపత్యం, కుటుంబాల మద్య పాత…
కర్నూలులో ఓ దారుణం చోటుచేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్య చేసుకున్నారు. భార్య, ఇద్దరు పిల్లలకు విషం ఇచ్చిన ప్రతాప్, వారు చనిపోయారని నిర్ధారించుకున్నాక, తానుకూడా విషం తీసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నగరంలో ప్రతాప్ టీవీ మెకానిక్ గా పనిచేస్తున్నాడు. మానసిక కుంగుబాటుతోనే ప్రతాప్ ఈ ఘోరానికి పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఒకే కుటుంబంలో నలుగురు ఆత్మాహత్యకు పాల్పడటంతో ఆ ప్రాంతంలో విషాదఛాయలు నెలకోన్నాయి. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
ఆంధ్రపదేశ్‌లోని కర్నూలు జిల్లాలో పాతకక్షలు భగ్గుమన్నాయి. కర్నూలు జిల్లాలోని గడివేముల మండలంలోని పెసరవాయి గ్రామంలో టీడీపీ నేతలను ప్రత్యర్ధులు నరికి చంపారు. అడ్డొచ్చిన అనుచరులపై కూడా దాడులు చేశారు. పెసరవాయి గ్రామానికి చెందిన ఇద్దరు అన్నదమ్ములు ప్రతాప్ రెడ్డి, నాగేశ్వర్ రెడ్డీలు గురువారం ఉదయం అనుచరులతో కలిసి వెళ్తున్న సమయంలో ప్రత్యర్ధులు దాడి చేశారు. ఈ దాడిలో ప్రతాప్ రెడ్డి, నాగేశ్వర్ రెడ్డీలు అక్కడికక్కడే మరణించగా, ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. గాపపడిన ముగ్గురిని నంధ్యాల ఆసుపత్రికి తరలించి వైద్యం…
కర్నూలు జిల్లాలో కరోనాతో చనిపోయిన వారిలో పురుషులే అత్యధికంగా ఉన్నారు. తాజా గణాంకాలను పరిశీలిస్తే ఇదే వాస్తవమని తెలిసింది. ఇప్పటివరకు జిల్లాలో 1,12,956 మంది కరోనా బారిన పడ్డారు. ఇందులో 1,12,575 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. వైరస్ సోకినవారిలో 751 మంది చనిపోయారు. ప్రస్తుతం జిల్లాలో యాక్టివ్ కేసులు 3,630 వున్నాయి. అయితే కరోనా బారిన పడినవారిలో పురుషులే ఎక్కువగా ఉన్నారు. ఈ నెల 2వ తేదీ వరకు ఉన్న గణాంకాలను పరిశీలిస్తే.. మొత్తం మృతులు…
కర్నూలు ఎమ్మిగనూరులో మరో ఏటీఎం మిషన్ ధ్వంసం అయ్యింది. ఆదోని రోడ్డులో ఎస్బిఐ ఏటీఎం మిషన్ ధ్వంసం చేసారు దుండగులు. దీంతో ఇప్పటికి మొత్తం మూడు మిషన్ లను టార్గెట్ చేసారు దుండగులు. అయితే ఈ ఘటన పై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ జరిపారు. అంతరం ఈ ఘటన పై ఓ నిర్ధారణకు వచ్చారు. అయితే ఈ ఘటన చోరీ కోసం చేసిన ప్రయత్నం కాదంటున్నారు పోలీసులు, ఎస్బిఐ అధికారులు. ఇది కేవలం తాగుబోతుల…
కర్నూలులో దారుణం జరిగింది. సంతోష్ నగర్‌లో మహేశ్వర రెడ్డిని (35) కిరాతకంగా హత్య చేయడం కలకలం రేపింది. మహేశ్వరరెడ్డి తెలంగాణలో ఎస్‌బీఐలో ఫీల్డ్ ఆఫీసర్‌గా పని చేస్తున్నారు. ఆయనకు మరో వ్యక్తితో రోడ్డుపై కారు పార్కింగ్ విషయంలో గొడవ జరిగింది. ఈ గొడవ తర్వాత మహేశ్వర రెడ్డిని దుండగులు కత్తితో పొడిచి చంపేశారు. హత్య వెనుక రియల్ ఎస్టేట్ వివాదాలు కారణమనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ హత్యపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లారు. కేసు…