కర్నూలులో దారుణం జరిగింది. సంతోష్ నగర్‌లో మహేశ్వర రెడ్డిని (35) కిరాతకంగా హత్య చేయడం కలకలం రేపింది. మహేశ్వరరెడ్డి తెలంగాణలో ఎస్‌బీఐలో ఫీల్డ్ ఆఫీసర్‌గా పని చేస్తున్నారు. ఆయనకు మరో వ్యక్తితో రోడ్డుపై కారు పార్కింగ్ విషయంలో గొడవ జరిగింది. ఈ గొడవ తర్వాత మహేశ్వర రెడ్డిని దుండగులు కత్తితో పొడిచి చంపేశారు. హత్య వెనుక రియల్ ఎస్టేట్ వివాదాలు కారణమనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ హత్యపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. హత్యకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.