కర్నూలులో ఓ దారుణం చోటుచేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్య చేసుకున్నారు. భార్య, ఇద్దరు పిల్లలకు విషం ఇచ్చిన ప్రతాప్, వారు చనిపోయారని నిర్ధారించుకున్నాక, తానుకూడా విషం తీసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నగరంలో ప్రతాప్ టీవీ మెకానిక్ గా పనిచేస్తున్నాడు. మానసిక కుంగుబాటుతోనే ప్రతాప్ ఈ ఘోరానికి పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఒకే కుటుంబంలో నలుగురు ఆత్మాహత్యకు పాల్పడటంతో ఆ ప్రాంతంలో విషాదఛాయలు నెలకోన్నాయి. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.