తుంగభద్ర జలాశయం ఇప్పుడు డేంజర్‌లో పడింది.. జలాయంలోని మరో 7 గేట్లు ప్రమాదంలో ఉన్నాయని అధికారులు గుర్తించారు. 33 గేట్లలో గతేడాది ఆగస్టు 10వ తేదీన వరద ఉధృతికి 19వ గేటు కొట్టుకుపోయింది. అయితే కన్నయ్యనాయుడు సలహాతో స్టాప్ లాగ్ ఏర్పాటు చేసి తాత్కాలిక మరమ్మతులు చేశారు. కొత్తగేటు తయారైనా ఈ ఏడాది
Ration Rice Connects Family in Adoni: ‘రేషన్ బియ్యం’ కారణంగా ఓ తల్లి, కొడుకు కలిశారు. 7 ఏళ్ల క్రితం తప్పిపోయిన మతిస్థిమితం లేని బాలుడి కోసం.. తల్లిండ్రులు, పోలీసులు, ప్రకటనల ద్వారా ఎంత వెతికినా దొరకలేదు. బాలుడిపై ఆశలు చంపేసుకుని ఆ తల్లి జీవనం కొనసాగిస్తోంది. కాలం కలిసొచ్చిందో, దేవుడు కరుణించాడో తెలియదు కానీ.. రేషన్ బియ్యం ద్వారా చివరకు తల్లి చెంతకు చేరుకున్నాడు. ఈ ఆశ్చర్యకర, ఊహించని ఘటన కర్నూలు జిల్లాలోని ఆదోనిలో…
కడప జిల్లా గండికోటలో జరిగిన ఇంటర్ విద్యార్థిని వైష్ణవి హత్య కేసులో కొత్త ట్విస్ట్ వచ్చి చేరింది.. విద్యార్థిని వైష్ణవిని ప్రియుడు లోకేష్ హత్య చేశాడని మృతురాలి కుటుంబ సభ్యులు ఆరోపిస్తుండగా.. అసలు, మైనర్ బాలిక హత్య కేసులో ప్రియుడు లోకేష్ ప్రమేయం లేదని కర్నూల్ డీఐజీ కోయ ప్రవీణ్ స్పష్టం చేశారు..
Kurnool POCSO Court Sentences Man to 20 Years in Jail: నాలుగేళ్ల చిన్నారిపై అత్యాచారం కేసులో కర్నూలు పోక్సో కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. బాలికపై అత్యాచారం కేసులో ఎల్లయ్య అనే వ్యక్తికి 20 ఏళ్ల జైలు శిక్షను విధించింది. అంతేకాదు రూ.50 వేలు జరిమానా, బాధితురాలికి రూ.2 లక్షలు చెల్లించాలని కోర్టు ఆదేశించింది. 2021 జనవరి 26వ తేదీన నంద్యాల జిల్లా చాగలమర్రి మండలంలోని ఓ గ్రామంలో నాలుగేళ్లపై బాలికపై ఎల్లయ్య అత్యాచారం…
తొలకరి వర్షాలు ప్రారంభం కావడంతో కర్నూలు జిల్లాలో వజ్రాల వేట ఊపందుకుంది. కొన్ని రోజులుగా జనం, రైతులు తమ అదృష్టంను పరీక్షించుకునేందుకు వజ్రాల వేట కోసం పొలాలకు క్యూ కడుతున్నారు. ఈ క్రమంలో కొందరికి విలువైన వజ్రాలు దొరికాయి. ఇప్పటికే తుగ్గలి మండలంలో మదనంతపురం, జొన్నగిరిలో విలువైన వజ్రాలు లభించగా.. తాజాగా పెండకల్ గ్రామంలో ఓ వ్యవసాయ కూలీకి విలువైన వజ్రం లభ్యమైంది. Also Read: Horoscope Today: శుక్రవారం దినఫలాలు.. ఆ రాశి వారికి పదవీ…
కర్నూలు జిల్లాలో తన భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్నారనే అనుమానంతో ఓ వృద్ధున్ని దారుణంగా హత్య చేశాడో వ్యక్తి.. కాలు నరికి బైక్ లో తీసుకువెళ్లి పోలీస్ స్టేషన్ లో లొంగిపోయారు. నరికిన కాలు చేతిలో పట్టుకొని బైక్ పై వెళ్తున్న భయానక దృశ్యాలు సెల్ ఫోన్ లో చిత్రీకరించారు.
కర్నూలు జెడ్పీ సమావేశంలో జెడ్పీ చైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి, ఎమ్మెల్యే పార్థ సారథి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. విషయం సూటిగా చెప్పాలని ఎమ్మెల్యే పార్థ సారథికి జెడ్పీ చైర్మన్ సూచించారు. రైతు సమస్యలపై చర్చించే ఓపిక లేకుంటే ఎలా? అని ఎమ్మెల్యే ప్రశ్నించారు. టైం లేకుంటే మీరు వెళ్లిపోండని, తాము చర్చించుకుంటాం అని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ క్రమంలో జెడ్పీ సమావేశంలో ఎమ్మెల్యే పార్థ సారథి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘అసెంబ్లీలో డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు…
నేను కూడా రాయలసీమ బిడ్డనే.. రాయలసీమలో ఫ్యాక్టన్ ఉండేది.. ఫ్యాక్షన్ ను కూకటివేళ్లతో పెకిలించాను అన్నారు సీఎం నారా చంద్రబాబు నాయుడు.. కర్నూలు జిల్లాలో పర్యటించిన ఆయన.. కేంద్రీయ విద్యాలయ సమీపంలో ప్రజా వేదిక కార్యక్రమంలో పాల్గొన్నారు.. ప్రజా వేదికలో పీ4 విధానంలో భాగంగా బంగారు కుటుంబాలు, మార్గదర్శులతో ముఖాముఖి నిర్వహించారు..
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బిజీగా గడుపుతున్నారు.. ఓవైపు సమీక్షలు, సమావేశాలు, ర్యాలీలు.. మధ్యలో జిల్లాల పర్యటనలకు వెళ్తున్నారు.. ఇక, సీఎం చంద్రబాబు రేపు (17వ తేదీ) కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు. రేపు ఉదయం 11.25కి కర్నూలు ఎయిర్ పోర్ట్ చేరుకుంటారు సీఎం చంద్రబాబు..
కర్నూలు జిల్లా గూడూరులో ముగ్గురు యువకులను అదుపులోకి తీసుకున్నారు కర్నూలు పోలీసులు.. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, భార్య అన్నా లెజినోవా, వాళ్ల కుమారుడు మార్క్ శంకర్ పై సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేశారట యువకులు.. దీనిపై గుంటూరులో సైబర్ క్రైం క్రింద కేసు నమోదు చేశారు పోలీసులు.. ముగ్గురు యువకులు పుష్పరాజ్, ఉదయ్ కిరణ్, ఫయాజ్‌గా గుర్తించారు..