టీడీపీ అధినేత చంద్రబాబు చిత్తూరు జిల్లాలోని కుప్పం నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. ఈ క్రమంలో రామకుప్పం మండలం అరిమాను పెంట గ్రామంలో చంద్రబాబు మాట్లాడుతూ.. అమ్మ, చెల్లిలను రాజకీయంగా వాడుకొని వదిలేసాడని సీఎం జగన్‌పై విమర్శలు గుప్పించారు. అంతేకాకుండా పోలవరం 71 శాతం పూర్తి చేసామని, ఇవ్వాళే భారతి సిమెంట్ బస్తా పై 30 రూపాయలు పెంచారని ఆయన మండిపడ్డారు. మూడేళ్ల పాలనలో జగన్ మూడు ఇళ్లు కూడా నిర్మించలేదని, సాక్షిలో మేనేజర్‌గా పని చేసే వ్యక్తి నన్ను…
కుప్పం నియోజకవర్గంలో ఈ రోజు టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటిస్తున్నారు. దేవరాజపురంలో భారీ ఎత్తున తరలివచ్చి టీడీపీ శ్రేణులు, అభిమానులు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మూడు రోజుల పాటు గ్రామాల్లో పర్యటిస్తా…కార్యకర్తలు, ప్రజలను కలుస్తానని ఆయన తెలిపారు. నేను ఎప్పుడూ కుప్పం అభివృద్ధి గురించే ఆలోచించానని, నిత్యావసరాలు తీవ్ర భారంగా మారిపోయాయని ఆయన అన్నారు. పొరుగున ఉన్న రాష్ట్రంలో పెట్రో ధరలు 10 రూపాయలు తక్కువగా ఉందని, ఎవడబ్బ సొమ్మని ఓటీఎస్‌కు 10…
కుప్పం రివ్యూలో చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేసారు. రాష్ట్ర స్థాయిలో పార్టీలో కోవర్టులు తయారయ్యారు. పార్టీలోని కోవర్టులను ఏరిపారేస్తా. కుప్పం నుంచే పార్టీ ప్రక్షాళన ప్రారంభిస్తా అని చంద్రబాబు అన్నారు. ఇక నన్ను మెప్పించడం కాదు.. ప్రజల్లో పనిచేసిన వారికే గుర్తింపు. స్థానిక నేతల అతి విస్వాసం వల్లనే కుప్పంలో ఓటమి తప్పలేదు. కుప్పం స్థానిక నాయకత్వంలో మార్పులు చెయ్యాలన్న కార్యకర్తల సూచనలు అమల్లోకి తెస్తానన్న చంద్రబాబు… ఇకపై తరుచూ కుప్పంలో పర్యటిస్తానని.. కార్యకర్తలకు, నేతలు ఎక్కవ…
మొన్న పంచాయతీలు.. నిన్న పరిషత్‌లు.. తర్వాత మున్సిపాలిటీలు.. ఇప్పుడు కుప్పంలో బాబు పీఠం కదల్చడమే టార్గెట్‌గా పెట్టుకున్నారట అధికారపార్టీ నేతలు. ఫార్టీ ఇయర్స్ సీనియర్‌ను ఢీకొట్టడానికి ఓ యువనేతను బరిలో దించుతారనే టాక్ చిత్తూరు జిల్లా వైసీపీలో ఓ రేంజ్‌లో ఉంది. ఇంతకీ వైసీపీ వ్యూహం ఏంటి? ఎవరిని పోటీకి పెట్టబోతోంది? కుప్పంలో వైసీపీ దూకుడు పెంచుతుందా? కుప్పం నియోజకవర్గం మరోసారి హాట్ టాపిక్‌గా మారింది. అన్ని ఎన్నికలు ముగిసినా కుప్పం ఇంకా వార్తల్లోనే ఉంటోంది. ఈసారి…
కుప్పం అంటే తెలుగుదేశం పార్టీకి కంచుకోట.. టీడీపీ చీఫ్ నారా చంద్రబాబు నాయుడు ప్రాతినిథ్యం వహిస్తున్న అసెంబ్లీ నియోజకవర్గం కావడంతో అందరూ ఆ ప్రాంతాన్ని ప్రత్యేకంగా చూస్తారు.. ఒక్కప్పుడు ఏ ఎన్నికలు వచ్చినా టీడీపీదే తన ఆధిపత్యాన్ని ప్రదర్శించేది.. అయితే, ఈ మధ్య జరిగిన ఎన్నికల్లో కుప్పం మున్సిపాల్టీ కాస్త వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖాతాలో పడిపోయింది.. ఏకంగా చంద్రబాబు, లోకేష్, ఇతర నేతలు ప్రతిష్టాత్మకంగా తీసుకుని ప్రచారం నిర్వహించినా.. అధికార వైసీపీ ఎత్తుల ముందు చిత్తైపోయారు..…
ఏపీలో జరిగిన రెండో విడత మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై టీడీపీ విశ్లేషణ చేస్తోంది. మరి.. కుప్పంలో ఓటమిపై చంద్రబాబు పోస్టుమార్టం చేస్తారా? ఆ దిశగా ఆలోచన ఉందా? పార్టీ ఆఫీస్‌కు వస్తున్న తమ్ముళ్లు వేస్తున్న ప్రశ్నలేంటి? రెండో విడత మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై టీడీపీ విశ్లేషణ..!కుప్పం ఓటమిపైనా పోస్టుమార్టం చేస్తున్నారా? మొదటి విడతలో ఏపీలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలను బహిష్కరించడంతో ఆ ఫలితాలపై విశ్లేషణ చేసుకోవాల్సిన అవసరం లేదని భావించింది టీడీపీ. రెండో విడతలో జరిగిన…
కుప్పంలో ప్రస్తుతం ఎన్నికలు లేవు. రాజకీయ సభలు.. సమావేశాలు లేవు. కానీ.. జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల తీరు మరోసారి అక్కడ చర్చగా మారింది. నేరుగా టీడీపీ నేతలకే వార్నింగ్ ఇవ్వడంతో కలకలం రేగుతోంది. ఇంతకీ కుప్పంలో ఏం జరుగుతోంది? కుప్పంలో జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ వార్నింగ్స్..! కుప్పం మరోసారి పొలిటికల్ సర్కిళ్లలో హాట్ టాపిక్. టీడీపీ- జూనియర్ ఎన్టీఆర్‌కు మధ్య గ్యాప్ పెరుగుతుందా అనేట్టుగా అక్కడ పరిణామాలు చర్చకు దారితీస్తున్నాయి. తమ హీరోతో టీడీపీ నేతల వ్యవహారం…
చిత్తూరు జిల్లా కుప్పంలో ఆదివారం నాడు జూ.ఎన్టీఆర్ అభిమానులు ధర్నా చేయడం స్థానికంగా చర్చకు దారితీసింది. అయితే ఎన్టీఆర్ అభిమానులు టీడీపీ నేతలకు వ్యతిరేకంగా ధర్నా చేయడం హాట్‌టాపిక్‌గా మారింది. ఇటీవల ఏపీ అసెంబ్లీలో వైసీపీ నేతలు టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి భువనేశ్వరిపై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో నందమూరి ఫ్యామిలీతో పాటు జూ.ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ వంటి హీరోలు కూడా స్పందించారు. జూ.ఎన్టీఆర్ ఓ వీడియో ద్వారా అసెంబ్లీలో జరిగిన ఘటనను సున్నితంగా ఖండించాడు. అతడు…
వాన కష్టాలు మాజీ సీఎం చంద్రబాబునాయుడిని వదల్లేదు. చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం నారావారిపల్లిలోని మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇంటిని ముంచెత్తింది భారీ వరద నీరు. ఇంటి వెనుక పొలాలపై నుంచి వచ్చిన వరద ఇంటిని చుట్టుముట్టడంతో భద్రతా సిబ్బంది గదితో పాటు ఉద్యానవనం మునిగిపోయింది. గ్రామ పంచాయతీ అధికారులు పట్టించుకోక పోవడంతో సర్పంచ్ లక్ష్మీ భర్త గిరినాయుడు, చంద్రబాబు సోదరుడు సుబ్రహ్మణ్యం నాయుడు సాయంతో నీరు బయటకు పంపిస్తున్నారు.భారీవర్షం కారణంగా రేపు టీటీడీ…
ఏపీ అసెంబ్లీలో చంద్రబాబుపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. గురువారం ఉదయం నిర్వహించిన బీఏసీ సమావేశానికి చంద్రబాబు వస్తారని తాము భావించామని.. కానీ ఆయన బీఏసీకి రాలేదని జగన్ తెలిపారు. కొంచెం సేపు బీఏసీ సమావేశాన్ని తాము ఆలస్యం చేశామని.. అయినా చంద్రబాబు రాలేదని.. ఆయనకు ఏం కష్టం వచ్చిందో తనకైతే తెలియదని జగన్ వ్యాఖ్యానించారు. ‘చంద్రబాబుపై కుప్పం ఎన్నికల ఎఫెక్ట్ పడిందని మా వాళ్లు చెప్తున్నారు’ అంటూ జగన్ ఎద్దేవా చేశారు. Read Also:…