మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండేపై స్టాండప్ కమెడియన్ కునాల్ కమ్రా చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. షిండే అభిమానులకు, శివసేన కార్యకర్తలకు తీవ్ర ఆగ్రహాన్ని రప్పించింది. కునాల్ కమ్రా వ్యాఖ్యలతో శివసేన కార్యకర్తలు రెచ్చిపోయి విధ్వంసం సృష్టించారు.
మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండేపై ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ స్పందించారు. హాస్యనటుడు కునాల్ కమ్రా వ్యాఖ్యలను ఖండించారు. షిండేకు పూర్తి మద్దతు ప్రకటించారు. తన మిత్రుడిపై చేసిన వ్యాఖ్యలకు కునాల్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండేపై స్టాండప్ కమెడియన్ కునాల్ కమ్రా చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. షిండేను ఉద్దేశించి దేశద్రోహి అంటూ చేసిన వ్యాఖ్యలు రచ్చరచ్చ చేస్తున్నాయి. ఇప్పటికే శివసేన కార్యకర్తలు విధ్వంసానికి దిగారు. ఇక శివసేన కార్యకర్తలు.. పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు చేస్తున్నారు.