నల్గొండ మున్సిపాలిటీలోని పాతబస్తీ హిందూపూర్ వాటర్ ట్యాంకర్లో మృతదేహం లభించడంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరుపై ట్విట్టర్ (ఎక్స్) వేదికగా నిప్పులు చెరిగారు. ‘నాగార్జునసాగర్ ఉదంతం మరువకముందే నల్లగొండలో మరో ఘోరం’ అంటూ వచ్చిన కథనాన్ని రీట్వీట్ చేశారు. నల్గొండ జిల్లా కేంద్రంలోని పాతబస్తీ మిషన్ భగీరథ వాటర్ ట్యాంకులో ఓ మృతదేహం లభ్యమైంది. దాదాపు పదిరోజులుగా ప్రజలు అవే నీళ్లు తాగుతున్నారు. తాగునీటిలో తేడా కనిపించడంతో మున్సిపాలిటీ సిబ్బందితో కలిసి…
KTR: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల ముగింపు సందర్భంగా ఉత్సవాలలో భాగంగా నిర్వహించే కార్యక్రమాల్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొననున్నారు.
upally Krishna Rao: సాంకేతికంగా బిఅరెస్ గెలిచింది.. నైతికంగా కాంగ్రెస్ గెలిచిందని ఎక్సైజ్ పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర ప్రజలకు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ శుభాకాంక్షలు తెలిపారు.
ఎమ్మెల్సీ ఉప ఎన్నిక గెలుపు పై కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. ట్విట్టర్ వేదికగా.. ‘మహబూబ్ నగర్ గడ్డపై ఎగిరిన గులాబీ జెండా.. సీఎం సొంత జిల్లాల్లో బీఆర్ఎస్ సాధించిన ఈ గెలుపు.. మారుతున్న తెలంగాణ రాజకీయ ముఖచిత్రంలో కీలక మలుపు.. మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి నవీన్ కుమార్ రెడ్డి విజయం సాధించిన నవీన్ కుమార్ రెడ్డికి శుభాకాంక్షలు.. పార్టీ విజయం కోసం పని చేసిన ప్రతి ఒక్క…
ఆవిర్భావ వేడుకలకు హాజరు కావాలని మాజీ సీఎం కేసీఆర్ కు సీఎం రేవంత్ రెడ్డి ఆహ్వాన లేఖ రాశారు. వ్యక్తిగత ఆహ్వాన పత్రికను స్వయంగా కేసీఆర్ కు అందించాలని ప్రోటోకాల్ సలహాదారు హర్కర వేణుగోపాల్, డైరెక్టర్ అరవింద్ సింగ్ కు రేవంత్ సూచించారు.
జయ జయహే తెలంగాణ గీతంపై కేసీఆర్, కేటీఆర్ అనవసరపు రాద్ధాంతం చేస్తున్నారని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. తెలంగాణ ఉద్యమ పేరిట అధికారంలోకి వచ్చిన కేసీఆర్ 10 సంవత్సరాలు జయ జయహే తెలంగాణ గీతాన్ని రాష్ట్ర గీతంగా ప్రకటించలేదన్నారు.
KTR: చార్మినార్ను తొలగించడం అంటే ప్రతి ఒక్క హైదరాబాదీని అవమానించినట్లే అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం మూర్ఖపు నిర్ణయాలు తీసుకుంటోందని మండిపడ్డారు.
తెలంగాణలో ప్రభుత్వం ఉన్నట్టా? లేనట్టా? అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్(ట్విటర్) వేదికగా ప్రశ్నించారు. విత్తనాల కోసం రైతులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. ‘రాష్ట్రంలో ప్రభుత్వం ఉన్నట్టా..? లేనట్టా..? విత్తనాల కోసం రైతులకు ఏమిటీ వెతలు ?? పర్యవేక్షించాల్సిన వ్యవసాయ మంత్రి ఎక్కడ ? ముందుచూపు లేని ముఖ్యమంత్రి జాడేది ?? ఎన్నికల ప్రచారంలో తిరగడం తప్ప.. ఎన్ని ఎకరాలకు విత్తనాలు అవసరమో లెక్కలేదా ?? నిన్న.. ధాన్యం అమ్ముకుందామంటే కొనేటోడు లేడు..! నేడు.. విత్తనాలు కొందామంటే…
తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించి 10 ఏళ్లు అవుతున్న నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా వేడుకలు నిర్వహించాలని బీఆర్ఎస్ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు సోమవారం పార్టీ కార్యకర్తలను కోరారు. ఈ వేడుకలు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావాన్ని స్మరించుకోవడమే కాకుండా, గత పదేళ్లలో రాష్ట్రం సాధించిన అభివృద్ధి , విజయాలను హైలైట్ చేయడానికి కూడా ప్రణాళిక చేయబడింది. అందుకు తగ్గట్టుగానే జూన్ 1న హైదరాబాద్ లో క్యాండిల్ ర్యాలీతో ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. రాత్రి 7 గంటలకు ప్రారంభమయ్యే…
మెగాస్టార్ చిరంజీవికి గోల్డెన్ వీసా సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి బాలీవుడ్ వరకు తనదైన ముద్ర వేసిన మెగాస్టార్ చిరంజీవికి తాజాగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ)కి చెందిన కల్చర్ అండ్ టూరిజం డిపార్ట్ మెంట్ గోల్డెన్ వీసా ఇచ్చింది. ఎమిరేట్స్ ఫస్ట్ సంస్థ ద్వారా ఈ గోల్డెన్ వీసా ఇచ్చినట్టు చెబుతున్నారు. మెగాస్టార్ చిరంజీవి కంటే ముందు, బాలీవుడ్ సహా దక్షిణ భారత చలనచిత్ర పరిశ్రమకు చెందిన పలువురు తారలకు కూడా UAE ప్రభుత్వం గోల్డెన్…