బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు కాంగ్రెస్ సీనియర్ నేత షబ్బీర్ అలీ సవాల్ విసిరారు. బీఆర్ఎస్ హయాంలో 46 మందిని పార్టీలో చేర్చుకున్నారని చెప్పారు. తాను చెప్పిన వివరాలు తప్పని నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని షబ్బీర్ అలీ అన్నారు. మరి కేటీఆర్ ఏం చేస్తారో చెప్పాలని ఛాలెంజ్ చేశారు.
ఈసారి కేంద్ర బడ్జెట్లో సిరిసిల్లకు మెగా పవర్ లూమ్ క్లస్టర్‌ను తీసుకురావాలని.. కేంద్రమంత్రి బండి సంజయ్‌కు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బహిరంగ లేఖ రాశారు. పదేళ్లుగా ప్రతి బడ్జెట్లో కేంద్రం తెలంగాణకు మొండిచెయ్యి చూపిందని కేటీఆర్ లేఖలో పేర్కొన్నారు.
ప్రాణం తీసిన స్నేహితులతో దిగిన ఫోటో.. నమ్మితే నట్టేట ముంచారు.. నల్గొండ జిల్లా మాడుగుల మండలం చింతలగూడెంలో దారుణం జరిగింది. చింతలగూడెం గ్రామానికి చెందిన కోట రాజలింగం-రజిత కుమార్తె కోట కళ్యాణి(19) పాలిటెక్నిక్ పూర్తిచేసి ప్రస్తుతం ఇంటివద్ద ఉంటుంది. ఆమెను అదే గ్రామానికి చెందిన అరూరి శివ, కొమ్మనబోయిన మధు కొంతకాలంగా ప్రేమ పేరుతో వేధిస్తున్నారు. ప్రేమించాలని, లేకుంటే తమ ఫొటోలను సోషల్ మీడియాలో పెడతామని బెదిరించారు. ఈ విషయం తెలిస్తే తన కుటుంబం పరువుపోతుందని కళ్యాణి…
జగన్‌పై కేటీఆర్ మిత్ర ధర్మాన్ని పాటించారు వైసీపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఎందుకు ఓడిందో బీఆర్ఎస్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు తెలియకపోయినా ఏపీ ప్రజలకు తెలుసని ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు అన్నారు. ఇద్దరూ ఓడిపోయి మిత్ర ధర్మాన్ని పాటించారని మీడియా సమావేశంలో సెటైర్లు వేశారు. ‘తెలంగాణలో BRS(కేటీఆర్) ఓడితే జగన్ పట్టించుకోలేదు. మీరు మాత్రం ఆయనను ఓదారుస్తున్నారు. YCP పరాజయం కంటే ముందు తెలంగాణలో బీఆర్ఎస్ ఓటమికి కారణాలు ఆలోచించుకోవాలి’ అని హితవు పలికారు రఘురామకృష్ణం రాజు.…
Food safety: టీఆర్ఎస్ నేత కేటీఆర్ వ్యాఖ్యలకు తెలంగాణ వైద్యారోగ్యశాఖ స్పందించింది. కాంగ్రెస్ పాలనలో ప్రభుత్వ విద్యాసంస్థల్లో నాణ్యమైన ఆహారం ఇవ్వడంలేదని ఆయన ఆరోపించారు.
ఘోర ప్రమాదం.. బస్సును ఢీకొట్టిన పాల ట్యాంకర్.. 18 మంది మృతి.. ఉత్తరప్రదేశ్‌లోని ఉన్నావ్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లక్నో ఆగ్రా ఎక్స్‌ప్రెస్‌వే పై ట్యాంకర్, డబుల్ డెక్కర్ బస్సు ఢీకొన్నాయి. ఈ ఘటనలో బస్సు చాలాసార్లు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో మొత్తం 18 మంది ప్రయాణికులు మరణించగా, 19 మందికి పైగా గాయపడినట్లు సమాచారం. అందిన సమాచారం ప్రకారం, డబుల్ డెక్కర్ బస్సు (UP95 T 4720) బీహార్ లోని మోతిహారి…
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌పై ఏపీ మంత్రి సత్య కుమార్ విమర్శలు గుప్పించారు. “ధరణి పేరుతో తెలంగాణలో మీరు నడిపిన భూ మాఫియా మాదిరే ధర్మవరంలో గుడ్ మార్నింగ్ పేరుతో మీ భూ బకాసుర మిత్రుడు ప్రభుత్వ, అసైన్డ్, ప్రైవేటు, ప్రజల ఆస్తులను ఆక్రమించాడు. చివరికి చెరువులు, కొండలను కూడా అతడు కబళించాడు. గుడ్ మార్నింగ్ అంటే ప్రజలకు గుర్తుకు వచ్చేది కబ్జా… కలెక్షన్… కరప్షన్… కమీషన్లే! ఫాంహౌస్ కు పరిమితమైన మీరు ఎక్స్ లో అడిగినా అతడి…
ట్విట్టర్లో సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ ఫైర్ అయ్యారు. మెగా డీఎస్సీ ఎక్కడ? ముఖ్యమంత్రి గారు అని ప్రశ్నించారు. తొలి క్యాబినెట్లోనే 25 వేలతో మెగా డీఎస్సీ అని మీరిచ్చిన మాట ఏమైంది? అని అన్నారు. తొమ్మిది నెలలు కావస్తున్నా.. లక్షలాది మంది డీఎస్సీ అభ్యర్ధుల ఆక్రందన మీ కాంగ్రెస్ సర్కారుకు వినపడటం లేదా? చురకలు అంటించారు.
బతుకమ్మ చీరల పంపిణీని నిలిపివేసిన కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటి రామారావు మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం నేత కార్మికులను వదిలిపెట్టిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తన నిర్ణయాన్ని పునరాలోచించాలని, బీఆర్ఎస్ ప్రభుత్వం ఏడేళ్లుగా కొనసాగిస్తున్న బతుకమ్మ చీరల పంపిణీని పునఃప్రారంభించాలని ఆయన కోరారు. ఈ వార్తా కాలమ్‌లలో ప్రచురితమైన వార్తా కథనం – “బతుకమ్మ చీరల పథకానికి శ్రీకారం చుట్టిందా?” అని రామారావు స్పందిస్తూ, కష్టాల్లో ఉన్న పేద నేత కార్మికుల పట్ల…