కేటీఆర్ బావమరిది ఫామ్హౌస్లోనే రేవ్పార్టీలా? రేవ్ పార్టీపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ పలు వ్యాఖ్యలు చేసాడు. ఇందులో భాగంగా బామ్మర్థి ఫాంహౌజ్ లోనే రేవ్ పార్టీలా..? డ్రగ్స్ తీసుకుంటూ అడ్డంగా దొరికినా బుకాయిస్తాడేమో.. ‘‘సుద్దపూస‘‘ను కావాలనే తప్పించారనే వార్తలొస్తున్నయని, సమాజాన్ని భ్రష్టు పట్టిస్తున్న డ్రగ్స్ పై రాజీధోరణి ఎందుకని ఆయన అన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ కాంప్రమైజ్ పొలిటిక్స్ సిగ్గు చేటని, చిత్తశుద్ధి ఉంటే సమగ్ర విచారణ జరపాలని కోరారు. సీసీపుటేజీ సహా…
హైదరాబాద్ శివార్లలో డ్రగ్స్ పార్టీపై మెదక్ ఎంపీ రఘునందన్ రావు స్పందించారు. శని, ఆదివారాలు వచ్చాయంటే రేవ్ పార్టీలు అని విచ్చల విడిగా డ్రగ్స్ దందా జరుగుతోందన్నారు. విదేశీ మాదక ద్రవ్యాలతో పాటు, కొకైన్లు విచ్చల విడిగా తెచ్చి భాగ్య నగరంలో డ్రగ్స్ దందా చేస్తున్నారని వ్యాఖ్యానించారు.
Jaggareddy: కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి గాంధీభవన్ లో మీడియాతో మాట్లాడుతూ.. బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా దండిపాలెం బ్యాచ్ అయ్యింది అని విమర్శించారు.
రాజన్న సిరిసిల్లలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పర్యటించారు. అనంతరం ఆయన కాంగ్రెస్ కార్యకర్తలపై కీలక వ్యాఖ్యలు చేశారు. జగిత్యాలలో కాంగ్రెస్ నాయకులే కాంగ్రెస్ నాయకులే చంపుకుంటున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు.
నోటీసులకు నోటీసులతోనే సమాధానం చెప్తా అని ఆయన బండి సంజయ్ వెల్లడించారు. కేటీఆర్ కు లీగల్ నోటీసులు పంపిస్తా అని, కేటీఆర్ నీ అయ్య, నీ కుటుంబ సభ్యులు వచ్చి డ్రగ్స్ పై సంబంధం లేదని గుండె మీద చేయి వేసుకొని ప్రమాణం చేయమని చెప్పు అని ఆయన అన్నారు.
ఇవాళ ఆయన ఎన్టీవీతో ముఖాముఖి మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమంలోకి వచ్చిననాడే చావు తెగించి వచ్చామని, ఉద్యమ సమయంలో చంద్రబాబు, రాజశేఖర్ రెడ్డి లాంటి పెద్ద పెద్ద నాయకులతో కొట్లాడినమని ఆయన అన్నారు. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వాన్ని నడుపుతున్న చిట్టినాయుడి అని, ఆ చిట్టినాయుడు ఏదో కేసు పెడుతా.. అది చేస్తా.. ఇది చేస్తా అంటే భయపడేది లేదని కేటీఆర్ వ్యాఖ్యానించారు.
బీఆర్ఎస్ నేత కేటీఆర్ నాంపల్లిలోని స్పెషల్ మెజిస్ట్రేట్ కోర్టులో మంత్రి కొండా సురేఖపై క్రిమినల్ డిఫర్మేషన్ దాఖలు చేశారు. బాల్క సుమన్, సత్యవతి రాథోడ్, తుల ఉమ, దాసోజు శ్రవణ్ లను సాక్షులుగా పిటిషన్లో పేర్కొన్నారు. ఆ పిటిషన్ పై నాంపల్లి కోర్టులో కేటీఆర్ స్టేట్మెంట్ ఇచ్చారు. తాను అమెరికాలో 6 సంవత్సరాలు చదువుకున్నానని.. చదువు పూర్తి అయ్యాక ఇండియాకు తిరిగి వచ్చినట్లు మాజీ మంత్రి కేటీఆర్ తెలిపారు.
ధరణి పోర్టర్ ప్రారంభం నుంచి రైతుల పాలిట శాపంగా మారిందని పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ అన్నారు. సమస్యల పుట్ట ధరణి పోర్టల్ అని.. మాజీ సీఎం కేసీఆర్ సదుద్దేశ్యంతో తీసుకువచ్చారని అనుకున్నామన్నారు. కానీ ఊరు పేరు లేని సంస్థకు ధరణిని అప్పగించారని చెప్పారు. రైతులకు అనేక ఇబ్బందులు కలిగాయని తెలిపారు.