ముగిసిన మొదటిరోజు ఆట.. స్కోర్ ఎంతంటే? కోల్‌కతా ఈడెన్ గార్డెన్స్ వేదికగా భారత్, దక్షిణాఫ్రికా మధ్య జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్ తొలి రోజు వార్ వన్ సైడ్ లా ముగిసింది. టాస్ గెలిచిన భారత్ బౌలింగ్ ఎంచుకోగా.. ఆ నిర్ణయం పూర్తిగా ఫలితాన్ని ఇచ్చింది. భారత బౌలర్ల దెబ్బకు దక్షిణాఫ్రికా జట్టు తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 159 పరుగులకే ఆలౌట్ అయింది. ఇక దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ ఆరంభం బాగానే కనిపించినా.. ఆ తర్వాత భారత బౌలర్లు…
MLAs Defection Case: తెలంగాణ రాజకీయాల్లో మరో ఉత్కంఠభరిత ఘట్టం మొదలైంది.. పార్టీ మారిన ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసు సోమవారం సుప్రీంకోర్టులో విచారణకు రానుంది. ఈ కేసు రాష్ట్ర రాజకీయ భవిష్యత్తును, శాసనసభ పటిష్టతను ప్రభావితం చేయనుంది అనడంలో సందేహం లేదు. గతంలో ఒక పార్టీ నుంచి గెలిచి, మరో పార్టీలో చేరిన ఎమ్మెల్యేల అనర్హతపై సుప్రీంకోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుందనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ కేసులో కీలక పార్టీ అయిన BRS వర్కింగ్…
BRS vs Speaker: తెలంగాణ శాసనసభ స్పీకర్‌పై బీఆర్ఎస్ పార్టీ సుప్రీంకోర్టులో ధిక్కార పిటిషన్‌ను దాఖలు చేసింది. ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుల విషయంలో మూడు నెలల్లో చర్యలు తీసుకోవాలని అత్యున్నత న్యాయస్థానం గతంలో ఇచ్చిన ఆదేశాలను స్పీకర్ పూర్తి చేయలేదంటూ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తరపున ఈ పిటిషన్ దాఖలు అయింది.
CM Revanth Reddy: ప్రజాపాలన ప్రారంభమై రెండేళ్లైంది.. ప్రభుత్వ విధానాలు, నిర్ణయాలు, భవిష్యత్ కార్యాచరణపై చర్చించుకుందామని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు.. మీట్ ది ప్రెస్‌లో సీఎం పాల్గొని మాట్లాడారు.. ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి కాంగ్రెస్ ఎంతో త్యాగం చేసింది.. కానీ.. రాష్ట్రం వచ్చాక ప్రజలు బీఆర్ఎస్ ను గెలిపించారన్నారు. 2004లో ఉచిత కరెంట్‌పై వైఎస్సాఆర్ మొట్టమొదటి సంతకం చేశారని గుర్తు చేశారు.. రైతు రుణమాఫీ అమలు చేసి రైతులను ఆదుకుంది..
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ తేదీ దగ్గరపడుతోంది. ఈ నేపథ్యంలో అధికార ప్రతిపక్ష పార్టీలు గెలుపు కోసం వ్యూహాలు రచిస్తున్నాయి. తమ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తున్నాయి. ఈ క్రమంలో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి కేటీఆర్ పై కీలక వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్ మాటలు నమ్మొద్దని జూబ్లీహిల్స్ ఓటర్లకు సూచించారు. ఈ సందర్భంగా జగ్గారెడ్డి మాట్లాడుతూ.. మళ్ళీ ఐదేళ్లు మేమే అధికారంలో ఉంటామని తెలిపారు. జూబ్లిహిల్స్ ఓటర్లు… నవీన్ యాదవ్ యువకుడికి ఓటేయాలని…
CM Revanth Reddy : తెలంగాణ రాజకీయాల్లో అత్యంత సంచలనం సృష్టిస్తున్న ఈ ఫార్మాలా కేసు అంశంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. మాజీ మంత్రి కేటీఆర్‌ను అరెస్టు చేయాలన్నా, ఆయనపై చార్జిషీట్ దాఖలు చేయాలన్నా.. గవర్నర్ అనుమతి తప్పనిసరి అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. కేటీఆర్ విచారణకు ఇప్పటికే గవర్నర్ అనుమతి ఇచ్చినా.. చార్జిషీట్‌కు మాత్రం ఇంకా ఆమోదం లభించలేదన్నారు. 2018లో ‘ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్’ కు చేసిన…
CM Revanth Reddy : జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్‌కు మద్దతుగా సీఎం రేవంత్ రెడ్డి ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా శుక్రవారం నిర్వహించిన ప్రెస్ మీట్లో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. బ్యాడ్ బ్రదర్స్.. కిషన్ రెడ్డి, కేటీఆర్.. ఇద్దరు కలిసి మెట్రో విస్తరణ అపుతున్నారని ఆయన ఆరోపించారు. పీజేఆర్.. శశిధర్ రెడ్డి లు హైదరాబాద్ బ్రదర్స్.. హైదరాబాద్ బ్రదర్స్ అభివృద్ధి చేశారు.. బ్యాడ్ బ్రదర్స్.. అభివృద్ధిని అడ్డుకుంటున్నారని…
‘కింగ్ అవ్వుడు సంగతి పక్కనపెట్టు.. ముందు డిపాజిట్ తెచ్చుకో’ అంటూ కేంద్రమంత్రి కిషన్ రెడ్డిని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. కిషన్ రెడ్డి, కేటీఆర్ వేరు కాదని.. ఇద్దరు నాణెంకు ఉండే బొమ్మ బొరుసు లాంటి వాళ్లే అని పేర్కొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి కేసు సీబీఐకి ఇవ్వు అని చెప్పిన కిషన్ రెడ్డి.. ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని మండిపడ్డారు. కిషన్ రెడ్డి.. నీకు ఎవడు భయపడడు అని సీఎం రేవంత్ అన్నారు.…
CM Revanth Reddy : జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారం రోజురోజుకు ఉత్కంఠభరితంగా మారుతోంది. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి రహమత్ నగర్లో రోడ్ షో నిర్వహించి ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన బీజేపీ, బీఆర్ఎస్ నేతలపై విరుచుకుపడ్డారు. “శిల్పా రామం మేం కడితే… ఆయన పోయి సెల్ఫీలు దిగుతున్నాడు. మేమే మెట్రో తెచ్చాం. కానీ ఇవాళ క్రెడిట్ వేరేవాళ్లు తీసుకుంటున్నారు,” అని సీఎం రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. తదుపరి మాట్లాడుతూ,…
Revanth Reddy : జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డి రహమత్ నగర్ లో రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా జూబ్లీహిల్స్ ఓటర్లను ఉద్దేశిస్తూ ప్రసంగం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. 30 వేల మెజార్టీ తో కాంగ్రెస్ జెండా ఎగరబోతుందని ధీమా వ్యక్తం చేశారు. BRS ఉప ఎన్నికలు వచ్చాయి.. మా MLA చనిపోయారు… ఆయన సతీమణికి ఓటేయండి అని అడుగుతున్నారని, పట్నం వచ్చిన పేదలకు ఉద్యోగ..…