KTR: ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటారనే విషయం తెలిసిందే. ముఖ్యంగా కేటీఆర్.. మోదీ సర్కార్, కాంగ్రెస్ పార్టీలపై ట్విట్టర్ వేదికగా విరుచుకుపడుతున్నారు. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలకు సంబంధించిన సమాచారాన్ని అందజేస్తారు.
తెలంగాణ రాష్ట్ర అప్పులపై కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ చేసిన విమర్శలపై మంత్రి కేటీఆర్ ఘాటుగా స్పందించారు. ట్విట్టర్ వేదికగా మరోసారి కేంద్రంపై విరుచుకుపడ్డారు.
ఆత్మ నిర్భర్ భారత్ చాలా బాగుందని మంత్రి కేటీఆర్ ట్విట్ చేసారు. అది ప్రశంస నా..? లేదా కేటీఆర్ మోడీని ఎద్దేవ చేసారా అంటూ ప్రశ్నించుకుంటున్నారు. అయితే.. తెలంగాణ మంత్రి సోషల్ మీడియాలో ఎంతగా యాక్టివ్ వుంటారో మనందరికి తెలుసు. ఎవరు ఏ పోస్ట్ చేసిన వారికి సమాధానం చెబుతూ.. ప్రతిపక్ష పార్టీలపై ట్విటర్ వేదికగా విరుచుకుపడుతుంటారు. వ్యంగాస్ర్తాలు వేస్తుంటారు. ఇవాళ ఆయన కేంద్రం పై చేసిన ఓ ట్వీట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. జాతీయ…
రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్ కేంద్రంపై మరోసారి విరుచుకుపడ్డారు. ఆయన కాలికి గాయం కావడంతో ఆయన ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటున్నారు. తరచూ ట్విటర్‌లో కేంద్ర విధానాలను ఎండగట్టే మంత్రి.. విశ్రాంతి సమయంలోనూ కేంద్రంపై ట్వీట్ వార్ కొనసాగించారు. ట్విటర్ వేదికగా.. మరోసారి మోదీ సర్కార్‌పై ధ్వజమెత్తారు. బొగ్గు విషయంలో కేంద్ర ప్రభుత్వ విధానంపై వ్యంగ్యంగా స్పందించారు. మోదీ సర్కార్ ప్రణాళికా లోపం.. ముందుచూపు లేక దేశీయంగా బొగ్గు కొరత ఏర్పడిందని కేటీఆర్ విమర్శించారు. NPA…
టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ట్విటర్ వేదికగా ప్రధాని మోడీపై విరుచుకుపడ్డారు. ట్విటర్ వేదికగా ప్రధానిపై వ్యంగాస్త్రాలు సంధించారు. ద్రవ్యోల్భవణాన్ని నియంత్రిచలేని ప్రధానిని మీరేమంటారని ప్రశ్నించారు. అంతే కాకుండా దేశంలో చొరబాటును నియంత్రించలేక పోతున్న ఇలాంటి ప్రధానిని మీరేమని పిలుస్తారని నాలుగు ఆప్షన్లను కేటీఆర్ ట్వీటర్ వేదిగా ప్రశ్నించారు. అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దుల్లో చైనా రెండో గ్రామాన్ని నిర్మించిందని, శాటిలైట్ ఫోటోలతో సహా మీడియా ప్రచురించిన కథనాలను కేటీఆర్ ట్వీట్ చేసారు. అయితే.. 2021లొ…