KTR Tweet: రూపాయి విలువ పతనమవుతుంటే.. రేషన్ దుకాణాల్లో ప్రధాని ఫొటో కోసం కేంద్ర ఆర్థిక మంత్రి తపన?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ktr satires on the central government behavior-on twitter రూపాయి విలువ పతనమవుతుంటే..కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మాత్రం రేషన్ దుకాణాల్లో ప్రధాని ఫొటో కోసం వెతుకుతున్నారని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ కేంద్రంపై మరోసారి విరుచుకుపడ్డారు. డాలర్ తో పోలీస్తే రూపాయి విలువ చరిత్రలో అత్యంత కనిష్ఠానికి పడిపోవడంపై కేటీఆర్ ట్విటర్ వేదికగా కేంద్రం పై విమర్శలు గుప్పించారు. రూపాయి విలువ చరిత్రలో అతి తక్కువకు పడిపోయిందని అంటుంటే.. సాదారణంగానే పడిపోయిందని కేంద్ర మంత్రి అంటున్నారని మండిపడ్డారు కేటీఆర్. నిరుద్యోగం, ద్రవ్యోల్బణం.. ఇలా అన్ని అర్థిక అవరోధాలకు ‘యాక్ట్స్ ఆఫ్ గాడ్’ కారణమని, విశ్వగురువును పొగడండి అంటూ తన ట్విట్టర్ ఖాతాలో ఎద్దేవా చేశారు మంత్రి కేటీఆర్.
While Rupee is at an all time low
Also Read
- CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
- Mallu Bhatti Vikramarka: హైదరాబాద్‌లో ప్రపంచస్థాయి స్టేడియం.. తెలంగాణను క్రీడా హబ్‌గా మారుస్తాం..
- Kidnap: హైదరాబాద్ టోలిచౌకి పరిధిలో దారుణం.. బాలిక కిడ్నాప్, విక్రయం..
- Telangana Govt: వియత్నాంకు 40 మంది ఉపాధ్యాయులు, అధికారుల బృందం.. ఎందుకంటే..
Madam FM is busy looking for PM’s photos in PDS shops
She will tell you that the Rupee will find its natural course. All economic hardships, unemployment & inflation are due to Acts of God
Hail Vishwa Guru 🙏 https://t.co/cB6as4bnpv
— KTR (@KTRTRS) September 23, 2022
అయితే.. రూపాయి విలువ ఎన్నడూ లేనంతగా పతనమైతే, జుమ్లాలు మాత్రం ఎన్నడూ లేనంతగా వృద్ధి చెందాయని కేటీఆర్ వ్యాఖ్యానించారు. అంతేకాకుండా.. ప్రపంచ మార్కెట్లు, ఫెడ్ రేట్ల కారణంగా రూపాయి విలువ పడిపోయిందని జ్ఞానాన్ని బోధిస్తున్న భక్తుల వాదనతో విశ్వగురు మోదీ అంగీకరించబోరని అన్నారు. ఇక.. కేంద్ర ప్రభుత్వ అవినీతి చర్యల కారణంగానే రూపాయి విలువ పతనమైందని, ఐసీయూలో ఉందంటూ గతంలో మోదీ చేసిన వ్యాఖ్యలను ట్విట్టర్ వేదికగా ప్రస్తావించారు మంత్రి కేటీఆర్.
To all those Bhakts who are giving Gyan on how world markets & Fed rates are affecting Rupee
VishwaGuru Modi Ji does not agree with your logic; Am merely quoting from his amazing pearls of wisdom
👇Rupee is losing strength because of corruption in Union Govt
👇Rupee is in ICU pic.twitter.com/S0aNIAbUCQ
— KTR (@KTRTRS) September 23, 2022
తాజావార్తలు
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!