KTR slammed Revanth Reddy: భారత ఆర్మీపై రేవంత్ రెడ్డి చేసిన నీచమైన కామెంట్స్ ని వెనక్కి తీసుకోవాలని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు. భారత ఆర్మీకి క్షమాపణ చెప్పాలన్నారు. కేవలం ఎన్నికల్లో లబ్ధి కోసం ఆర్మీని రేవంత్ రెడ్డి వాడుకోవడంపైన కేటీఆర్ మండిపడ్డారు. సైన్యంలో చేరి, తమ ప్రాణాలను పణంగా పెట్టడానికి అపారమైన కృషి, అంకితభావం, నిబద్ధత, దేశంపై ప్రేమ అవసరమన్నారు. యూనిఫామ్ ధరించిన మన సైనికులు అత్యంత కఠినమైన…
KTR Hhouse Arrest: ఆర్టీసీ ఛార్జీల పెంపునకు నిరసనగా బీఆర్ఎస్ ఆధ్వర్యంలో చలో బస్ భవన్ కార్యక్రమం ప్రకటించారు. ఈ రోజు ఉదయం బస్ భవన్ కి సిటీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వెళ్లాలని పిలుపునిచ్చారు. ఉదయం 8.45కి రేతిబౌలి నుంచి బస్ భవన్ వరకు ఆర్టీసీ బస్సులో ప్రయాణించాలని కేటీఆర్, తలసాని, సబితా ఇంద్రారెడ్డి, పద్మారావు నిర్ణయించారు. ముందుగానే రంగంలోకి దిగిన పోలీసులు.. బీఆర్ఎస్ నేతలను ఎక్కడికక్కడ హౌస్ అరెస్ట్ చేశారు. తాజాగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్…
హైదరాబాద్ అగ్ని ప్రమాదంపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. ఓల్డ్ సిటీలోని గుల్జార్ హౌస్ వద్ద జరిగిన అగ్నిప్రమాద ఘటన వివరాలు తెలిసి అత్యంత షాక్‌కు, బాధకు గురయ్యానన్నారు. ఈ విషాద ఘటన హృదయవిదారకంగా ఉందని.. ఈ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు నా హృదయపూర్వక సంతాపం తెలియజేశారు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసిన ఆయన.. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని కోరారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లేఖ రాశారు. దమ్ముంటే ఫార్ములా-ఈ రేస్ అంశంపై రాష్ట్ర శాసనసభలో చర్చ పెట్టాలని లేఖ ద్వారా సవాల్ విసిరారు. ఫార్ములా-ఈ రేస్ వ్యవహారంలో ప్రభుత్వం కొన్ని నెలలుగా గత బీఆర్ఎస్ ప్రభుత్వం మీద, ముఖ్యంగా తన మీద అనేక నిరాధార ఆరోపణలు చేస్తోందని లేఖలో తెలిపారు.
దశాబ్దాలుగా మూసీ నదిపై కాంగ్రెస్ దీర్ఘకాల నిర్లక్ష్యం, పునరుజ్జీవన ప్రాజెక్టు బాధితుల బాధల నుంచి దృష్టి మరల్చేందుకు నల్గొండలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేపట్టిన మూసీ పాదయాత్ర రాజకీయ స్టంట్ అని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు అభివర్ణించారు. మూసీ నది పునరుజ్జీవన ప్రాజెక్టులో భాగంగా హైదరాబాద్‌లో ఇళ్లు కూల్చే ప్రమాదంలో ఉన్న బాధిత కుటుంబాలను ఆయన పరామర్శించారు.