KTR : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరో ప్రతిష్టాత్మక అంతర్జాతీయ సమావేశానికి హాజరుకానున్నారు. ఈ ఏడాది జూన్ 20, 21 తేదీలలో ఇంగ్లాండ్‌లో నిర్వహించబడనున్న ఆక్స్‌ఫర్డ్ ఇండియా ఫోరమ్ (Oxford India Forum) సదస్సుకు ముఖ్యఅతిథిగా కేటీఆర్‌ను ఆహ్వానించింది. “భారత అభివృద్ధికి అత్యాధునిక సాంకేతికతలు” అనే థీమ్‌తో జరుగుతున్న ఈ సదస్సును ఆక్స్‌ఫర్డ్ ఇండియా ఫోరమ్ వ్యవస్థాపకుడు సిద్ధార్థ్ సేఠి ప్రకటించారు. కేటీఆర్ తన అనుభవాలను, ఆలోచనలను ఈ సదస్సులో భాగంగా వివిధ దేశాల నిపుణులు,…