తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి, టీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు పై బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ తీవ్ర స్థాయి లో మండిపడ్డారు. శుక్రవారం నగరంలో జరిగిన క్రెడాయ్ సమావేశంలో మంత్రి కేటీఅర్ మాట్లాడుతూ.. ఆంధ్రలో ఉన్న తన మిత్రుడు తెలంగాణ వారిని బస్సులో ఆంధ్రకు తీసుకొని వచ్చి, అక్కడ రోడ్లు, విద్యుత్ సరఫరా ఎంత అధ్వానంగా ఉందో చూపించాలని కోరినట్లు మంత్రి తన ప్రసంగంలో వ్యాఖ్యానించడంపై డీకే అరుణ…
హైదరాబాద్‌లో క్రెడాయ్ ప్రాపర్టీ షోలో పక్క రాష్ట్రం అంటూ సంబోధిస్తూ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు వైసీపీ నేతలు వరుసగా కౌంటర్లు ఇస్తున్నారు. తాజాగా మంత్రి జోగి రమేష్ స్పందించారు. ఏపీలో తమ ప్రభుత్వ హయాంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని, ఇక్కడ జరిగిన అభివృద్ధి ఏంటో కళ్లారా చూసి తెలుసుకోవాలని కేటీఆర్‌కు జోగి రమేష్ సవాల్ విసిరారు. ఏపీ అభివృద్ధిని చూసి ఓర్వలేక కేటీఆర్ విమర్శలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ తరహాలోనే కేటీఆర్…
పక్కరాష్ట్రంలో రోడ్లు, విద్యుత్, నీళ్లు లేవని మంత్రి కేటీఆర్ చేసిన కామెంట్లకు వైసీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు కౌంటర్ ఇచ్చారు. కేసీఆర్ లాగే కేటీఆర్ పిట్టకథలు చెబుతున్నారని మల్లాది విష్ణు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీ గురించి మాట్లాడే హక్కు టీఆర్ఎస్ నేతలకు లేదన్నారు. నీళ్లు, కరెంట్, రోడ్లు ఉన్నాయో లేదో విజయవాడకు వచ్చి చూస్తే అర్ధమవుతుందన్నారు. కోస్తా ప్రజల వల్లే హైదరాబాద్ అభివృద్ధి జరిగిందని మల్లాది విష్ణు వ్యాఖ్యానించారు. అలా అభివృద్ధి ప్రాంతంగా మారిన హైదరాబాద్…
హైదరాబాద్‌లోని మాదాపూర్ హైటెక్స్‌లో క్రెడాయ్ ప్రాపర్టీ షోను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పక్క రాష్ట్రాలపై సెటైర్లు వేశారు. కొద్దిరోజుల క్రితం తన మిత్రుడు పండగకు పక్క రాష్ట్రం వెళ్లి వచ్చారని.. వచ్చిన తర్వాత తనకు ఫోన్ చేశారని.. అక్కడ నాలుగు రోజులు ఉండగా కరెంట్ లేదని.. నీళ్లు లేవని.. రోడ్లు సరిగ్గా లేవని చెప్పారని కేటీఆర్ వెల్లడించారు. తెలంగాణలోని వాళ్లను నాలుగురోజులు బస్సుల్లో పక్క రాష్ట్రానికి పంపాలని.. అప్పుడు తెలంగాణ ప్రభుత్వం…