తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ తనపై నిరాధారమైన ఆరోపణలు చేశారంటూ మంత్రి కేటీఆర్ తన న్యాయవాదితో బండి సంజయ్‌కు నోటీసులు జారీ చేశారు. దీనిపై బండి సంజయ్ స్పందిస్తూ… కేటీఆర్.. నీ తాటాకు చప్పుళ్లకు భయపడే ప్రసక్తే లేదు.. దమ్ముంటే సీబీఐ విచారణకు సిద్దపడు అంటూ సవాల్ విసిరారు. తాను ప్రజల తరపున పోరాడుతున్నానని, వాస్తవాలే మాట్లాడుతున్నానని బండి సంజయ్ స్పష్టం చేశారు. లీగల్ నోటీసుల పేరుతో కేసీఆర్, కేటీఆర్ లు చేసే తాటాకు చప్పళ్లకు…