Govt School Teacher Suspended in Mancherial: మంచిర్యాల జిల్లా చెన్నూరులోని ఎన్‌పీ వాడ జడ్పీహెచ్‌ఎస్‌లో విధులు నిర్వర్తిస్తున్న ఆర్‌కె ప్రసాద్ అనే ఉపాధ్యాయుడిని ఉన్నతాధికారులు శనివారం సస్పెండ్ చేశారు. ఈ నెల 24న మాజీ మంత్రి, బీఆర్ఎస్ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ జన్మదిన వేడుకలను నిర్వహించినందుకు గాను గవర్నమెంట్ స్కూల్ టీచర్‌పై వేటు పడింది. ఈ ఘటనను విద్యాశాఖ ఉన్నతాధికారులు సీరియస్‌గా తీసుకున్నారు. ప్రభుత్వ పాఠశాలలను రాజకీయ కార్యక్రమాలకు వేదికగా మార్చడంపై సోషల్ మీడియాలో…
CM Revanth Reddy Wishesh to KTR: నేడు బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పుట్టినరోజు. 1976 జూలై 24న సిద్ధిపేటలో జన్మించిన కేటీఆర్.. నేటితో 48వ పడిలోకి అడుగుపెడుతున్నారు. ఈ సందర్భంగా ఆయనకు సెలబ్రిటీలు, ప్రముఖులు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. కేటీఆర్‌కు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. నిత్యం ప్రజాసేవ చేస్తూ రాష్ట్ర అభివృద్ధికి పాటుపడాలని కోరారు. Also Read: Telangana Assembly Sessions 2024: తెలంగాణ ప్రజలకు నిర్మలా సీతారామన్ క్షమాపణ…
Himanshu: మంత్రి కేటీఆర్ ఈరోజు 47 పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా బీఆర్‌ఎస్ శ్రేణులు ఎక్కడికక్కడ సందడి చేస్తున్నాయి. రోడ్లపై ఫ్లెక్సీల ఏర్పాటుతో పాటు కేక్‌లు కట్ చేసి తమ అభిమాన నాయకుడి జన్మదిన వేడుకలు జరుపుకుంటున్నారు.
కేటీఆర్ సోషల్ మీడియా ద్వారా తెలియచేస్తూ, ఈ విశ్రాంతి సమయంలో ఏవైనా ఓటీటీ కంటెంట్ చూడటానికి తనకు సలహా ఇవ్వమని కోరారు. దాంతో చాలా మంది చాలా రకాలుగా రియాక్ట్ అవుతున్నారు. ట్విట్టర్ వేదికగా అనేక సినిమాలు, వెబ్‌సిరీస్‌లు చూడాలని సూచించారు. అభిమానులు, సెలబ్రిటీలే కాకుండా ఓటీటీ సంస్థలు కూడా శుభాకాంక్షలతో పాటు సినిమాలు, సిరీస్‌లు చూడాలని కోరాయి.
జూలై 24న కేటీఆర్ పుట్టిన రోజు సందర్భంగా నగరంలో భారీ ప్లెక్సీలు దర్శనమిస్తున్నాయి. మంత్రి పై పార్టీ శ్రేణులు తమ అభిమానాన్ని చాటుకునేందుకు పుట్టిన రోజును వినూత్నంగా నిర్వహించేందుకు సన్నాహాలు రెండురోజుల ముందునుంచే మొదలపెట్టారు. టీఆర్‌ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు పుట్టిన రోజు వేడుకను ఒక సామాజిక సేవా కార్యక్రమంగా నిర్వహించేందుకు ఆయన అభిమానులు శ్రీకారం చుట్టారు. అయితే.. గిప్ఏస్మైల్ ఛాలెంజ్ పేరుతో సేవా కార్యక్రమం మొదలెట్టారు. ఈనెల 24న పుట్టినరోజు జరుపుకోనున్న టీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్…
కేటీఆర్ జన్మదిన సందర్భంగా శనివారం (24న) తలపెట్టిన ముక్కోటి వృక్షార్చనకు ఏర్పాట్లు పూర్తి అయినట్లు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ నిర్వాహకులు ప్రకటించారు. వివిధ జిల్లాల్లో నమోదవుతున్న వర్షాలను దృష్టిలో పెట్టుకుని ఒక్క గంటలో నాటాలన్ననియమాన్ని సడలించినట్లు తెలిపారు. వర్షాల తెరిపి, వీలును బట్టి రోజంతా తమ తమ ప్రాంతాల్లో మొక్కలు నాటి ముక్కోటి వృక్షార్చనను విజయవంతం చేయాలని ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ పిలుపు నిచ్చారు. . టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ కు ఈ…
జులై 24న తెలంగాణ మంత్రి కేటీఆర్ పుట్టిన రోజు.. ఈ సందర్భంగా బొకేలు, కేకులు, హోర్డింగులు అంటూ డబ్బుని వృధా చేయవద్దని ఆయన సూచించారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ‘గిప్ట్ ఏ స్మైల్’ లో భాగంగా వంద మంది దివ్యాంగులకు ప్రత్యేకమైన ద్విచక్ర వాహనాలను అందించనున్నట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు. గత ఏడాది తాను 6 అంబులెన్స్ లను విరాళంగా ఇవ్వగా.. తెరాస ప్రజా ప్రతినిధులు, నేతలు 90 వాహనాలు ఇచ్చారని గుర్తు చేశారు. అవసరం ఉన్న…