Gift A Smile Challenge as a KTR Birthday: ఈనెల 24న కేటీఆర్ పుట్టినరోజు.. నగరంలో వెలసిన భారీ ప్లేక్సీలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జూలై 24న కేటీఆర్ పుట్టిన రోజు సందర్భంగా నగరంలో భారీ ప్లెక్సీలు దర్శనమిస్తున్నాయి. మంత్రి పై పార్టీ శ్రేణులు తమ అభిమానాన్ని చాటుకునేందుకు పుట్టిన రోజును వినూత్నంగా నిర్వహించేందుకు సన్నాహాలు రెండురోజుల ముందునుంచే మొదలపెట్టారు. టీఆర్‌ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు పుట్టిన రోజు వేడుకను ఒక సామాజిక సేవా కార్యక్రమంగా నిర్వహించేందుకు ఆయన అభిమానులు శ్రీకారం చుట్టారు. అయితే.. గిప్ఏస్మైల్ ఛాలెంజ్ పేరుతో సేవా కార్యక్రమం మొదలెట్టారు.
ఈనెల 24న పుట్టినరోజు జరుపుకోనున్న టీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ జన్మదిన వేడుకలను వినూత్న సామాజిక కార్యక్రమంగా నిర్వహించేందుకు ఆయన అభిమానులు శ్రీకారం చుట్టారు. కాగా.. ప్రకటనలు, బొకేల రూపంలో నగదును వృథా చేయకుండా ఆ డబ్బును సేవకు ఉపయోగించాలనే లక్ష్యంతో ట్విట్టర్ వేదికగా గిప్ఏస్మైల్ ఛాలెంజ్ పేరుతో ఓ వినూత్న కార్యక్రమం చేపట్టారు. తాము సాయం చేసి మరికొందరిని నామినేట్ చేయగా వారు ఛాలెంజ్ స్వీకరించి భాగస్వాములవుతున్నారు. ఈనేపథ్యంలో.. ట్రెండింగ్‌లో గిప్ఏస్మైల్ ఇప్పటికే ఎమ్మెల్సీ నవీన్ కుమార్ ఈ సవాల్ స్వీకరించి ఓ స్వచ్ఛంద సంస్థకు అంబులెన్స్ కోసం పది లక్షల రూపాయలు విరాళం ఇవ్వగా.. శశి కనపర్తి అనే ఎన్ఆర్ఐ నిశాంత్ కేన్సర్ ఫౌండేషన్‌కు 500 డాలర్లు విరాళం ఇచ్చారు. కాగా.. ప్రస్తుతం ట్విట్టర్లో గిఫ్ట్ స్మైల్ ఛాలెంజ్ ట్రెండింగ్‌లో ఉంది. ఈనేపథ్యంలో.. ఆపదలో ఉన్నామన్న వారిని తక్షణమే ఆదుకునే కేటీఆర్ ను స్ఫూర్తిగా తీసుకుని ఈ కార్యక్రమం ప్రారంభించామని ఆయన అభిమానులు చెబుతున్నారు. అంతేకాకుండా.. దివ్యాంగులకు అవయవాలు సమకూర్చడం, రక్తదాన కార్యక్రమాలు, అనాథ, వృద్ధాశ్రమాల్లో భోజన పంపిణీ, ప్రభుత్వ పాఠశాలలు, ఆస్పత్రుల్లో రక్షిత మంచినీటి ప్లాంట్లు వంటి సేవా కార్యక్రమాలు చేయాలని కేటీఆర్ సన్నిహితులు ఛాలెంజ్ విసురుతున్నారు. అయితే ఈ ప్రచారంలో టీఆర్‌ఎస్ శ్రేణులు కూడా భాగస్వామ్యులవుతున్నాయి.
Also Read
- BRS MLAs: కేటీఆర్, హరీశ్‌రావు సహా 14 మంది ఎమ్మెల్యేలపై కేసులు.. ఎమ్మెల్సీలు తాతా మధు, నవీన్‌రెడ్డి అరెస్ట్
- BRS MLC Tata Madhu Arrest: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు అరెస్ట్..
- Telangana Degree PG Colleges Bandh: నేడు డిగ్రీ, పీజీ కాలేజీలు బంద్.. ఎందుకంటే?
- KTR: శాసనసభ కాదు.. అది దుశ్శాసన సభ: సీఎం రేవంత్‌పై కేటీఆర్ ఫైర్
Police Command Control Centre: దుబాయ్‌కి బుర్జ్ ఖలీఫా.. హైదరాబాద్‌కి కమాండ్ కంట్రోల్ సెంటర్
తాజావార్తలు
-
ఎలాన్ మస్క్ పై ‘Musk’ డాక్యుమెంటరీ.. ట్రైలర్లో సంచలన వ్యాఖ్యలు..!
-
Postpone Trend : పెద్ద సినిమా అంటే పోస్ట్‌పోన్ వార్త వైరల్ కావాల్సిందే
-
Theatrical Releases: ఈ వారం థియేటర్లలో అదరగొట్టబోతున్న సరికొత్త సినిమాలు..
-
Heart Attack: షాకింగ్.. 13 ఏళ్లకే గుండెపోటు.. స్కూల్ వాష్‌రూమ్‌లో ఏడో తరగతి బాలుడి మృతి..
-
India vs Pakistan: ఆసియా కప్‌లో మరోసారి భారత్-పాక్ పోరు సాధ్యమే.. కానీ, ఓ ట్విస్ట్!
ట్రెండింగ్
-
Huawei FreeBuds 7, Watch 6 సిరీస్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
1,705 కి.మీ రేంజ్, 4,890W ఆడియోతో అదిరిపోయే SUVలతో Xiaomi SkyNomad సిరీస్ లాంచ్..!
-
India Head Coach: టీమిండియా హెడ్ కోచ్ పదవా?.. నాకు విడాకులు పక్కా.. ఆశిష్ నెహ్రా సంచలన వ్యాఖ్యలు!
-
13.3 అంగుళాల 3.4K 144Hz డిస్‌ప్లే, 12,000mAh బ్యాటరీతో Xiaomi Pad 9 Pro Max లాంచ్..!
-
7.58 అంగుళాల ఫోల్డబుల్ డిస్‌ప్లే, 6000mAh బ్యాటరీ, 200MP లైకా కెమెరాతో Xiaomi 18 Fold లాంచ్.!