(ఆగస్టు 27న కె.ఎస్. ప్రకాశ రావు జయంతి)కోవెలమూడి సూర్యప్రకాశరావు బహుముఖ ప్రజ్ఞాశాలి. నటునిగా, నిర్మాతగా, దర్శకునిగా, స్టూడియో అధినేతగా, కథకునిగా పలు విన్యాసాలు చేసి అలరించిన ఘనుడు కె.ఎస్.ప్రకాశరావు. ఆయన తనయుడే దర్శకేంద్రునిగా జనం మదిలో నిలచిన కె.రాఘవేంద్రరావు. ఆయన వారసులందరూ చిత్రసీమలోనే రాణించారు. పెద్దకొడుకు కె.కృష్ణమోహనరావు నిర్మాతగా అనేక చిత్రాలు నిర్మించారు. చిన్న కొడుకు కె.ఎస్.ప్రకాశ్ పేరు మోసిన సినిమాటోగ్రాఫర్, కొన్ని చిత్రాలకు దర్శకత్వం కూడా చేశారు. ప్రకాశరావు అన్న కొడుకు కె.బాపయ్య కూడా దర్శకునిగా…