CM Chandrababu: శ్రీ కృష్ణ జన్మాష్టమి పర్వదినం సందర్భంగా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు కృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. ఆ శ్రీకృష్ణ భగవానుడు ఆశీస్సులు మీ కుటుంబాన్ని ఆనందంతో, ఆరోగ్యంతో, ఐశ్వర్యంతో ఆశీర్వదించాలని మనసారా కోరుకుంటున్నాను అని ఎక్స్ ( ట్విట్టర్ ) వేదికగా పోస్ట్ చేశారు.
శ్రీ కృష్ణ జన్మాష్టమిని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా ఆలయాల్లో పూజలు ఘనంగా జరుగుతున్నాయి. గురువారం సాయంత్రం జన్మాష్టమి వేడుకలు ప్రారంభం కావడంతో మధురలోని ఆలయాలకు భక్తులు పోటెత్తారు. నగరంలోని ఆలయాలను రంగురంగుల దీపాలతో అలంకరించారు.
Krishnashtami: శ్రావణమాసంలో వచ్చే కృష్ణాష్టమి పండగకు చాలా ప్రాధాన్యం ఉంటుంది. ముఖ్యంగా కృష్ణాష్టమి పండగ రోజు చాలా ప్రాంతాలలో ఉట్లు ఏర్పాటు చేసి వాటిని కొడుతుంటారు. అసలు కృష్ణాష్టమికి ఉట్లు ఎందుకు కొడతారో చాలా మందికి తెలియదు. ఇదో ధర్మసందేహంగా ఉంటుంది. సాధారణంగా శ్రీకృష్ణుడు చిన్నతనంలో ఉండగా పలువురి ఇళ్లలోకి ప్రవేశించి పాలు, పెరుగును దొంగతనం చేసేవాడు. అయితే ఆ రోజుల్లో బుల్లి కృష్ణుడి ఆగడాల నుంచి తప్పించుకోవడానికి చాలా మంది తమ పాలు, పెరుగు ఉట్టిలో…