క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ ప్రస్తుతం మరాఠీ చిత్రం ‘నటసమ్రాట్’ను తెలుగులో ‘రంగమార్తాండ’ పేరుతో రీమేక్ చేస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పార్ట్ పూర్తి అయిన ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ప్రస్తుతం జరుగుతోంది. హౌస్ ఫుల్ మూవీస్, రాజశ్యామల ఎంటర్త్సైన్మెంట్స్ బ్యానర్ పై కాలిపు మధు, వెంకట్ రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమాకు మాస్ట్రో ఇళయరాజా సంగీతాన్ని అందిస్తున్నారు. ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం, రమ్యకృష్ణ, రాహుల్ సిప్లిగంజ్, ఆదర్స్ బాలకృష్ణ, అలీ రేజా, అనసూయ, శివాత్మిక…
క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కుటుంబ కథా చిత్రాలతో ప్రేక్షకుల మనసులను గెలుచుకున్న కృష్ణ వంశీ గత మూడేళ్ళుగా సినిమాలకు గ్యాప్ ఇచ్చిన విషయం విదితమే.
మరాఠిలో ఘన విజయం సాధించిన చిత్రం ‘నటసమ్రాట్’. నానా పటేకర్ టైటిల్ పాత్రధారిగా మహేశ్ మంజ్రేకర్ తెరకెక్కించిన ఈ సినిమా చక్కని ప్రేక్షకాదరణ పొందింది. సహజంగా రీమేక్స్ కు దూరంగా ఉండే కృష్ణవంశీ ‘నటసమ్రాట్’ను ‘రంగమార్తాండ’ పేరుతో తెలుగులో తీస్తున్నారు. ప్రకాశ్ రాజ్, బ్రహ్మానందం, రమ్యకృష్ణ, శివాత్మిక రాజశేఖర్ తదితరులు ఇందులో కీలక పాత్రలు పోషించారు. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ పూర్తయ్యింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. తాజాగా డబ్బింగ్ ను ప్రారంభించినట్టు…