తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత పదేళ్ల కంటే సమర్థవంతంగా పని చేశామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. కృష్ణా నదీ జలాలపై ప్రగతి భవన్‌లో తెలంగాణ నీటి పారుదల శాఖ ఆధ్వర్యంలో ప్రజంటేషన్ ఇచ్చారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాట్లాడారు. కాళేశ్వరంపై బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం చేస్తుందని.. బీఆర్ఎస్ వాదనలో ఎన్ని అబద్ధాలు ఉన్నాయో చెప్తామన్నారు. మిగులు జలాల వాడకం కోసం ఎస్ఎల్బీసీ టన్నెల్, కల్వకుర్తి, నెట్టెంపాడు, పాలమూరు రంగారెడ్డి, డిండి, కోయిల్ సాగర్…
KRMB : కృష్ణా నదీ నిర్వహణ మండలి (KRMB) భేటీకి ఆంధ్రప్రదేశ్ హాజరుకాకపోవడం తెలంగాణ రాష్ట్రాన్ని తీవ్ర అసహనానికి గురిచేసింది. తెలంగాణ అధికారులు ఈ చర్యను KRMB authority పట్ల కనీస గౌరవం లేకపోవడంగా అభివర్ణించారు. గత సమావేశంలో ఆంధ్రప్రదేశ్ 23 టీఎంసీ నీటి పంపిణీకి అంగీకరించినప్పటికీ, తాజా భేటీకి హాజరుకాకపోవడంలో ఉద్దేశ్యం ఏమిటని ప్రశ్నించారు. తెలంగాణ నీటిపారుదల శాఖ అధికారులు KRMBపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, ఏపీ ప్రభుత్వం తన హాజరును నిర్లక్ష్యం చేయడం ఆమోదయోగ్యం…
Uttam Kumar Reddy : మాజీ మంత్రి హరీష్ రావు పచ్చి అబద్ధాలు, అసత్యాలు జనంలోకి తీసుకువెళ్లే ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు మంత్రి ఉత్తమ్ కుమార్. ఇరిగేషన్ ప్రాజెక్టులపై తప్పుడు ప్రాపగండా చేస్తున్నారని, అద్భుతాలు చేస్తున్నట్లు కేసీఆర్, హరీష్ నటించారన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. బీఆర్ఎస్ హయాంలో తెలంగాణ ఇరిగేషన్ కు తీరని అన్యాయం జరిగిందని, లక్ష కోట్లు తెచ్చి కాళేశ్వరం కడితే వాళ్ళ టైమ్ లో కట్టిన ప్రాజెక్టు.. కూలిపోయిందన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్…