ప్రముఖ నిర్మాత శిరీష, శ్రీధర్ లగడపాటి తనయుడు విక్రమ్ సహిదేవ్. అతను హీరోగా తెరకెక్కుతున్న సినిమా ‘కొత్తగా రెక్కలొచ్చెనా’! ఈ మూవీతో అలనాటి ప్రముఖ నిర్మాత, నటుడు అట్లూరి పుండరీకాక్షయ్య పెద్దబ్బాయి ప్రదీప్ బి అట్లూరి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. సౌమిక పాండియన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీకి అచ్చు రాజమణి సంగీతం అందించారు. ప్రస్తుతం ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటోంది. వాలెంటైన్స్ డే సందర్భంగా ‘ఉప్పెన’ టీమ్ ‘కొత్తగా రెక్కలొచ్చెనా’ మూవీ…