కత్తిపోట్లకు గురైన మెదక్ ఎంపీ, దుబ్బాక బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి కొత్త ప్రభాకర్‌రెడ్డిని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పరామర్శించారు. యశోదా ఆసుపత్రికి వెళ్లిన కేసీఆర్.. ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. వైద్యులను అడిగి ప్రభాకర్ రెడ్డి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు.
మెదక్ ఎంపీ, దుబ్బాక బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డిపై కత్తి దాడి ఘటనపై తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ రియాక్ట్ అయ్యారు. ఎన్నికల ప్రచారంలో కొత్త ప్రభాకర్ రెడ్డిపై దాడి గురించి తెలుసుకుని తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యానన్నారు.
మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి పై కత్తి దాడి దుదృష్టకరం, బాధాకరం అని దుబ్బాక బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు తెలిపారు. దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాను.. ప్రజాస్వామ్య లో దాడులు పరిష్కారం కావు.. కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నారు.
IT Raids: బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మర్రి జనార్దన్ రెడ్డి, పైళ్ల జనార్దన్ రెడ్డిల ఇళ్లు, కార్యాలయాల్లో ఐటీ అధికారులు సోదాలు కొనసాగిస్తున్నారు. మూడు రోజులుగా ఐటీ అధికారులు సోదాలు చేస్తున్న సంగతి తెలిసిందే.