Kotha Prabhakar: మెదక్ ఎంపీ ప్రభాకర్ రెడ్డిపై దాడి కేసులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రభాకర్ రెడ్డిపై హత్యాయత్నానికి మూడు రోజుల ముందు నుంచే రాజు స్కెచ్ వేసినట్లు సమాచారం. ఎంపీ ప్రచార షెడ్యూల్, కదలికలను ఎప్పటికప్పుడు నిందితుడు తెలుసుకున్నట్లు తెలిసింది. మూడు రోజుల క్రితం మిరుదొడ్డిలో బీఆర్ఎస్ నాయకులు అంజి రెడ్డి, కమలాకర్ రెడ్డిలను కలిసి ఎంపీ పర్యటన వివరాలపై ఆరా తీశాడు రాజు. ఆదివారం తొగుటలో ఎంపీ ప్రచారాన్ని పరిశీలించాడు. అనంతరం నిన్న కూడా దౌల్తాబాద్ మండలంలో జరుగుతున్న ఎన్నికల ప్రచారంలో ఎంపీని రాజు ఫాలో అయ్యాడు. నిన్న సూరంపల్లి గ్రామంలో ఎంపీ ప్రచార రథంపైకి ఎక్కడానికి ప్రయత్నించట్లు సమాచారం. ఎంపీ కారు వద్దకు రాగానే సెల్ఫీ దిగుతానని వెళ్లి ఎంపీపై కత్తితో దాడి చేశాడని విశ్వనీయ సమాచారం.
కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఎంపీ ప్రభాకర్ రెడ్డిపై హత్యాయత్నం పక్కా ప్లాన్ ప్రకారం జరిగిందా..? నిందితుడు ఎంపీ పర్యటన వివరాలు తెలుసుకుని మాటు వేసి కత్తితో దాడి చేశాడా..? BRS నాయకులకు నిందితుడు రాజు ఎంపీ ప్రచారా షెడ్యూల్ ఎందుకు అడిగాడు..? మూడు రోజులుగా ఎంపీని ఎందుకు ఫాలో అవుతున్నాడు..? ఎంపీ ప్రభాకర్ రెడ్డిపై దాడి వ్యక్తిగత గొడవలా..? లేదా రాజకీయ కుట్ర కోణం ఉందా..? అనే దానిపై దర్యాప్తు చేస్తున్నారు.
అయితే.. సోషల్ మీడియాలో నిందితుడు రాజు వాట్సాప్ చాటింగ్ వైరల్ గా మారింది. దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావుతో వాట్సాప్ చాటింగ్ చేసినట్టు స్క్రీన్ షాట్ వెలుగులోకి వచ్చాయంటూ మీడియాలో ప్రచారం సాగుంతుంది. కాల్ మీ అన్న నేను రాజు ఇది నా కొత్త నెంబర్ అంటూ అక్టోబర్ 26న మెసేజ్, ఆ తరువాత అక్టోబర్ 28న కలవాలి అన్న అంటూ మరో మెసేజ్ లను బీఆర్ఎస్ నాయకులు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. అయితే ఎంత వరకు నిజమని ఇంకా నిర్ధారణ కాలేదు. దీనిపై కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు.
కాగా.. ఎంపీ ప్రభాకర్ రెడ్డిపై దాడి చేసిన నిందితుడు రాజు ఇంటి వద్ద పోలీసుల భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మిరుదొడ్డి మండలం పెద్ద చెప్యాల గ్రామంలో అడుగడుగునా పోలీసుల మోహరించారు. నిందితుడు రాజు, తల్లిదండ్రుల ఇంటి వద్ద పోలీసులు పహారా కాస్తున్నారు. నిన్న ఘటన జరిగిన వెంటనే ఇంటి నుంచి కుటుంబ సభ్యులు వెళ్లిపోయినట్లు సమాచారం. డీసీపీ మల్లారెడ్డి ఆధ్వర్యంలో గ్రామస్తులను పోలీసులు విచారిస్తున్నారు.
Spain Royal Baby Long Name: పేరులో 157 అక్షరాలు.. రిజిస్టర్ చేయలేమని చేతులెత్తేసిన అధికారులు..