IT Raids: బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మర్రి జనార్దన్ రెడ్డి, పైళ్ల జనార్దన్ రెడ్డిల ఇళ్లు, కార్యాలయాల్లో ఐటీ అధికారులు సోదాలు కొనసాగిస్తున్నారు. మూడు రోజులుగా ఐటీ అధికారులు సోదాలు చేస్తున్న సంగతి తెలిసిందే. బీఆర్ ఎస్ కు చెందిన ముగ్గురు ప్రజాప్రతినిధుల ఇళ్లలో ఐటీ అధికారులు ఈనెల 14వ తేదీ ఉదయం నుంచి సోదాలు చేస్తున్నారు. భువనగరి, నాగర్ కర్నూల్ ఎమ్మెల్యేలు పైల శేఖర్ రెడ్డి, మర్రి జనార్దన్ రెడ్డి, మెదక్ ఎంపీ కోట ప్రభాకర్ రెడ్డి నివాసాల్లో ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు. మెదక్ ఎంపీ కోట ప్రభాకర్ రెడ్డి నివాసంలో నిన్న ఉదయం ఐటీ అధికారులు సోదాలు నిలిపివేశారు. అయితే భువనగిరి, నాగర్ కర్నూల్ ఎమ్మెల్యేల ఇళ్లలో సోదాలు కొనసాగుతున్నాయి.
Read also: Adipurush: థియేటర్ లో హనుమంతుడి సీటుపై వర్మ సంచలన వ్యాఖ్యలు..
నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డికి చెందిన వస్త్ర దుకాణాల్లో ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు. మర్రి జనార్దన్ రెడ్డికి చెందిన ఇతర వ్యాపార సంస్థలపై ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు. మరోవైపు భువనగిరి ఎమ్మెల్యే పైల శేఖర్ రెడ్డి పలు రియల్ ఎస్టేట్ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టినట్లు గుర్తించిన ఐటీ అధికారులు.. ఈ కంపెనీల లావాదేవీలపై ఆరా తీస్తున్నారు. ఎమ్మెల్యేలు పైల శేఖర్ రెడ్డి, మర్రి జనార్దన్ రెడ్డి, ఎంపీ కోట ప్రభాకర్ రెడ్డి కలిసి వ్యాపారం చేస్తున్నారు. మెయిన్‌ల్యాండ్ డిజిటల్ టెక్నాలజీ ఈ ముగ్గురు భాగస్వాములను ప్రమోట్ చేస్తోంది. ఈ కంపెనీ పన్ను చెల్లింపులు, బ్యాలెన్స్ షీట్లను ఐటీ అధికారులు పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఈ సాయంత్రం వరకు సోదాలు కొనసాగే అవకాశం ఉంది. ఐటీ సోదాలు జరిగే ప్రాంతాల్లో కేంద్ర బలగాలు బందోబస్తు ఏర్పాటు చేశాయి.
Mahabubnagar: మహబూబ్‌నగర్ కల్తీ కల్లు ఘటన.. నేడు హైకోర్టులో విచారణ
ఐటీ సోదాల తర్వాత కడిగిన ముత్యంలా బయటకు వస్తానని నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి నిన్న ప్రకటించారు. ఆయన ఇప్పటికే ఐటీ శాఖకు రూ. 150 కోట్లు పన్నులు చెల్లించామని మర్రి జనార్దన్ రెడ్డి తెలిపారు. మేము ఐటి అధికారులకు సహకరిస్తున్నామన్నారు. మా సిబ్బంది కూడా సహకరిస్తున్నారని తెలిపారు. అయినా ఐటి అధికారులు మా సిబ్బందిని బెదిరిస్తున్నారని మండిపడ్డారు. కొన్ని చోట్ల మాన్ హ్యాండ్లింగ్ చేస్తున్నట్టుగా తెలుస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మేము కూడా అలాగే చేస్తామన్నారు. సోదాలు ముగిసిన తరువాత వారి సంగతి చూస్తామని హెచ్చారించారు.
మా దగ్గర సెల్ ఫోన్ లు తీసుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎటు కదల నివ్వడం లేదని మండిపడ్డారు. వ్యాపారం చేస్తున్నప్పుడు ఐటి వాళ్ళు వస్తారు.. చెక్ చేసుకుంటారని అన్నారు. మేము చెప్పేది చెబుతాం వాళ్ళు అడిగేది అడుగుతారని స్పష్టం చేశారు. నా లెక్కలు కడిగిన ముత్యంలా ఉంటుందని అన్నారు. ఎన్ని రోజులు జరిగిన సహరిస్తామన్నారు. మోదీ ది కొత్త రాజ్యాంగామా..? వ్యాపారం చేయోద్దా..? భూములు కొనడం తప్పా? అంటూ ప్రశ్నించారు. ఐటి అధికారులు నాకు అవార్డ్ ఇచ్చి వెళ్తున్నారని అన్నారు. 150 కోట్లు ట్యాక్స్ కట్టానని తెలిపారు. మా ఉద్యోగులను కొడుతున్నారని తెలుస్తుందని, తరువాత వాళ్ళ పని చూస్తా అని మండిపడ్డారు. తప్పు చేసే డబ్బులు కట్టించుకోవాలని అన్నారు. పూర్తి వివరాలతో మీడియా ముందుకు వస్తా అని స్పష్టం చేశారు.
Mahabubnagar: మహబూబ్‌నగర్ కల్తీ కల్లు ఘటన.. నేడు హైకోర్టులో విచారణ