మహాశివరాత్రి సందర్భంగా గుంటూరు జిల్లా కోటప్పకొండలో తిరునాళ్ల ఎంతో వైభవంగా జరుగుతుంది. ప్రభల వేడుక కన్నులపండువగా నిర్వహిస్తారు. వివిధ ప్రాంతాల నుంచి ప్రభలు తరలివచ్చే అవకాశాలు ఉండటంతో ట్రాఫిక్ సమస్య ఏర్పడకుండా ముందస్తు జాగ్రత్తగా పోలీసులు భక్తులకు కొన్ని సూచనలు చేశారు. నరసరావుపేట నుంచి నుంచి వచ్చే భక్తులు ఉప్పలపాడు, పెట్లూరివారిపాలెం మార్గంలో కొండకు చేరుకుని నాగిరెడ్డి గెస్ట్‌హౌస్ వద్ద వాహనాలు పార్కింగ్ చేయాలని.. అక్కడి నుంచి ప్రత్యేక బస్సుల్లో కొండపైకి చేరుకోవాలని తెలిపారు. నరసరావుపేట నుంచి…
మహాశివరాత్రి సందర్భంగా ఏపీఎస్‌ఆర్టీసీ ప్రత్యేకంగా ఆర్టీసీ బస్సులు నడపనుంది. ఈ విషయాన్ని స్వయంగా ఆర్టీసీ ప్రకటించింది. శివరాత్రి సందర్భంగా ఏపీలోని 96 శైవక్షేత్రాలకు 3,225 ప్రత్యేక బస్సులను నడపనున్నట్లు ఆర్టీసీ అధికారులు వెల్లడించారు. ఆయా బస్సుల్లో గతంలో మాదిరిగానే అదనపు ఛార్జీలు ఉంటాయని తెలిపారు. గుంటూరు జిల్లా కోటప్పకొండకు 410 బస్సులు, శ్రీశైలానికి 390 బస్సులు నడపనున్నట్లు వారు పేర్కొన్నారు. మరోవైపు కడప జిల్లా పొలతల, నిత్య పూజకోన, పశ్చిమ గోదావరి జిల్లాలోని బలివె, పట్టిసీమ తదితర…
కోటప్పకొండ పుణ్యక్షేత్రంలో మహాశివరాత్రి ఉత్సవాలకు ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. శ్రీ త్రికోటేశ్వర స్వామి దేవాలయం జిల్లాలోనే అత్యంత పురాతన మరియు ప్రసిద్ధ దేవాలయాలలో ఒకటి. మహా శివరాత్రి ఉత్సవాల సందర్భంగా రెండు రోజుల పాటు నిర్వహించే జాతరకు రాష్ట్రం నలుమూలల నుండి లక్షలాది మంది భక్తులు ఆలయాన్ని సందర్శిస్తారు. ఈ ఏడాది దాదాపు 10 లక్షల మంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్న అధికారులు అందుకు తగ్గట్టుగా ఏర్పాట్లు చేస్తున్నారు. వివిధ గ్రామాల నుంచి వచ్చే ‘ప్రభలు’…