Koona Srisailam Goud: గ్రేటర్ హైదరాబాద్‌లో పుంజుకోవాలని భావిస్తున్న కాంగ్రెస్ పార్టీ కీలక నేతలను పార్టీలోకి చేర్చుకోవడంపై దృష్టి సారించింది. ఈ క్రమంలో బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ కొంతకాలం క్రితం కాంగ్రెస్ పార్టీలో చేరారు.
మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గ బీజేపీ పార్టీ అభ్యర్థి కూన శ్రీశైలం గౌడ్ కు మద్దతుగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రచారం నిర్వహించారు. అందులో భాగంగా.. నిజాంపేట్ హనుమాన్ ఆలయం కూడలి వద్ద భారతీయ జనతా పార్టీ కార్నర్ మీటింగ్ లో పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కుత్బుల్లాపూర్ ప్రజల ప్రేమకు ధన్యవాదాలు తెలుపుతున్నట్లు తెలిపారు. కుత్బుల్లాపూర్ లో బలమైన నాయకుడు శ్రీశైలం గౌడ్ అని అన్నారు.