దేశ వ్యాప్తంగా ఆయా రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటికే పలు రాష్ట్రాల్లోని జిల్లాలు జలదిగ్భందంలో చిక్కుకుని ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. లక్షలాది మంది నిరాశ్రయులై.. శిబిరాల్లో తలదాచుకుంటున్నారు.
తెలుగు రాష్ట్రాల్లో విధ్వంసం సృష్టించిన గులాబ్ తుఫాన్ గురించి పూర్తిగా మర్చిపోకముందే మరో తుఫాను విజృంభించడానికి రెడీ అవుతోంది. ఉత్తర అరేబియా సముద్రంలో ఈ తుఫాను ఏర్పడనుందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. ఇవాళే ఈ తుఫాను ఏర్పడుతుందని ఐఎండీ అభిప్రాపయపడుతోంది. దీనికి ‘సైక్లోన్ షహీన్ అని పేరు పెట్టారు. ఈ పేరును కతార్ సూచించింది. ఈ తుఫాను భారత్‌పై పెద్దగా ప్రభావం చూపించబోదని పరిశోధకులు చెప్తున్నారు. ఇది పాకిస్థాన్ వైపు వెళ్లనుందని వివరించారు. అయితే భారీ…