సిర్పూర్‌లో నేతల మధ్య సవాళ్లు, ప్రతిసవాళ్లు కొనసాగుతున్నాయి. తుమ్మడి హట్టి ప్రాజెక్టుపై బహిరంగ చర్చకు రావాలంటూ మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్పకు ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్ బాబు మంగళవారం సవాల్ విసిరారు. ఎమ్మెల్యే సవాల్‌ను కోనప్ప స్వీకరించారు. ఈరోజు ఉదయం 11 గంటలకు తుమ్మడి హట్టి వద్ద బహిరంగ చర్చకు ఇద్దరు నేతలు, వారి అనుచరులు సిద్దమయ్యారు. అయితే కాగజ్ నగర్‌లో ఎమ్మెల్యే హరీష్ బాబును తుమ్మడి హట్టి వద్దకు వెళ్లకుండా ఆయన ఇంటి వద్ద పోలీసులు…
కోనేరు కోనప్ప..సిర్పూర్ టీ మాజీ ఎమ్మెల్యే. ముందు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారాయన. ఆ తర్వాత బీఎస్పీ ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత బీఆర్ఎస్ కండువా కప్పుకుని మరోసారి ఎమ్మెల్యే అయ్యారు. ఇక 2023 అసెంబ్లీ ఎన్నికల్లో... కూడా... బీఆర్ఎస్ తరపున పోటీ చేసి ఓడిపోయాక పాత గూడు కాంగ్రెస్ దరికే చేరారు కోనప్ప. కానీ.... చేరినప్పటి నుంచే ఆ పార్టీతో అంటీముట్టనట్టుగా ఉంటున్నారాయన. ఆ క్రమంలో మెల్లిగా నియోజకవర్గంలో ప్రాధాన్యత కూడా తగ్గుతూ వస్తోందట. ఇలాంటి పరిస్థితుల్లో...…
కాంగ్రెస్ పార్టీకి షాక్ తగిలింది. మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పారు. గతేడాది మార్చి 6న సీఎం రేవంత్‌రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఇకపై ఏ పార్టీలో కాకుండా స్వతంత్రంగా ఉంటానని తెలిపారు. బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ చేసిన వ్యాఖ్యల వల్లే బీఆర్ఎస్‌ను వీడినట్లు తెలిపారు. బీఆర్ఎస్, కేసీఆర్‌ను తాను ఎప్పుడూ విమర్శించలేదని స్పష్టం చేశారు. తాజాగా జరుగుతున్న గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో బీఎస్పీ అభ్యర్థికి మద్దతు ప్రకటించారు.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా రాజకీయాల్లో కోనేరు కోనప్ప స్టైలే వేరు. పార్టీ ఏదైనా డోంట్ కేర్... జనంలో పర్సనల్ ఇమేజ్ పెంచుకోవడమే మన స్టైల్ అన్నట్టుగా ఉంటారట ఆయన. 2004లో మొదటిసారి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలిచారాయన. 2014లో బీఎస్పీ తరపున గెలిచి ఆ తర్వాత రాజకీయ పరిస్థితుల్లో బీఆర్‌ఎస్ పంచన చేరారు. అదే పార్టీ నుంచి 2018 ఎన్నికల్లో విజయం సాధించారు కోనప్ప.
పార్లమెంట్ ఎన్నికలకు ముందు బీఆర్‌ఎస్ పార్టీకి షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఒక్కొక్కరు పార్టీకి గుడ్‌బై చెబుతున్నారు. ఇప్పుడు మరో నేత పార్టీకి గుడ్‌బై చెప్పేశారు. సిర్పూర్ మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప బీఆర్‌ఎస్ నుంచి హస్తం గూటికి చేరనున్నట్లు సమాచారం.