కరీంనగర్ జిల్లా మానకొండూర్ మండల కేంద్రంలోని చెరువు కట్ట సమీపంలో ప్రజా గోస బీజేపీ భరోసా బైక్ ర్యాలీని మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి ప్రారంభించారు. తెలంగాణ రాష్టంలో తండ్రి కొడుకుల అరాచక పాలన కొనసాగుతుందని తెలిపారు. సీఎం కేసీఆర్ మాటలు విని కరీంనగర్ జిల్లా అభివృద్ధి అయింది అనుకున్నానని మండిపడ్డారు. సీఎం కేసీఆర్ రాష్ట్రంలో ఏం చేసిండో ప్రజలకు చెప్పలేక వేరే రాష్ట్రాలలో పర్యటనలు చేస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు.
రెండు సార్లు ఎమ్మెల్యే గా గెలిచిన రసమయి బాలకిషన్ నియోజకవర్గంలో ఏం అభివృద్ధి చేయలేదని అన్నారు. దమ్ముంటే ఎమ్మెల్యే రసమయి రాజీనామా చేసి ఉప ఎన్నిక ధ్వారా మానకొండూర్ నియోజకవర్గన్ని అభివృద్ధి చేయాలని అన్నారు. అధికార పార్టీలో ఉన్న ఎమ్మెల్యే కు కూడా సీఎం కేసీఆర్ నిధులు ఇవ్వడం లేదా? అంటూ ప్రశ్నించారు. మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి లాగా దమ్ము ఉంటే రసమయి బాలకిషన్ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని సవాల్ విసిరారు.
Harish Rao: కన్న కొడుకు చీర కొనివ్వకపోయినా.. పెద్ద కొడుకు కేసీఆర్ బతుకమ్మ చీర ఇస్తున్నారు