Konda Surekha : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వేసిన పరువునష్టం దావా కేసులో నాంపల్లి కోర్టు క్రిమినల్ కేసు నమోదు చేయాలని ఆదేశించిన నేపథ్యంలో రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ స్పందించారు. “నా కేసుకు సంబంధించి గౌరవ కోర్టు కాగ్నిజెన్స్ తీసుకొని ముందుకు వెళ్ళాలని స్పష్టం చేసింది.” “నాకు ఈ దేశ న్యాయవ్యవస్థ మీద అపారమైన గౌరవం ఉంది. ఈ కేసులు, కొట్లాటలు నాకు కొత్త కాదు. నా జీవితమే…
Konda Surekha vs KTR : హైదరాబాద్‌లోని నాంపల్లి కోర్టు మంత్రి కొండా సురేఖపై కీలక తీర్పు వెలువరించింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ వేసిన పరువు నష్టం దావా కేసులో సురేఖపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని కోర్టు పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసు BNS సెక్షన్ 356 కింద పరిగణనలోకి తీసుకోబడగా, BNSS సెక్షన్ 222 r/w 223 ప్రకారం నేరాన్ని స్వీకరించాలని కోర్టు నిర్ణయించింది. కోర్టు ఆదేశాల…
తెలంగాణ రాష్ట్రం వాళ్ల సొత్తు అన్నట్లు కేసీఆర్ కుటుంబం వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ రెడ్డి సలహాదారు, మాజీ ఎమ్మెల్యే వేం నరేందర్ రెడ్డి మండిపడ్డారు. ‘తెలంగాణలో సంక్షేమ పనులు అభివృద్ధిని చూడలేని గత పాలకులు అవాకులు చెవాకులు పేలుతున్నారు. పేదలు తినే ప్రతి బుక్కలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం కనబడుతుంది. గత పదేళ్లలో ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదు. 14వ తేదీన 40 లక్షల మందికి రేషన్ కార్డులు ఇస్తున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం కష్టపడి పని చేస్తుంది.…
CM Revanth Reddy: రాష్ట్ర రాజధాని నగరం హైదరాబాద్ లోని రాజేంద్రనగర్ లో ఉన్న వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆవరణలో మొక్కలు నాటి, పర్యావరణాన్ని కాపాడేందుకు ప్రతిజ్ఞ చేశారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ కార్యక్రమానికి మంత్రి కొండా సురేఖతోపాటు పలువురు ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వన మహోత్సవం సందర్భంగా ప్రజలను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. “వనమే మనం… మనమే…
Revanth Reddy: తెలంగాణలో పర్యావరణ పరిరక్షణ కోసం ఓ అడుగు ముందుకేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు ‘వన మహోత్సవం’ కార్యక్రమాన్ని రాష్ట్ర రాజధానిలో ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన రాజేంద్రనగర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆవరణలో మొక్కలు నాటి, పర్యావరణాన్ని కాపాడేందుకు ప్రతిజ్ఞ చేశారు. అలాగే బొటానికల్ గార్డెన్స్ లో రుద్రాక్ష మొక్కను నాటారు. ఈ కార్యక్రమంలో మంత్రి కొండా సురేఖ, పలు ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. Read Also:Mulugu: ములుగు జిల్లాలో మంత్రుల…
నేడు గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ సర్వసభ్య సమావేశం జరగనుంది. సమావేశానికి మంత్రి కొండా సురేఖ, ఎక్స్ అఫీషియో, ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు, వివిధ విభాగాల అధికారులు హాజరుకానున్నారు. అయితే నేటి కౌన్సిల్ సమావేశంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. కౌన్సిల్ సమావేశం చర్చనీయాంశంగా మారింది.
ఫైళ్ళ క్లియరెన్స్ విషయంలో మంత్రికి, ముఖ్య కార్యదర్శికి మధ్య విభేదాలు ప్రస్తుతం తెలంగాణ సచివాలయంలో హాట్ టాపిక్ అయ్యాయి. మంత్రి తీసుకున్న నిర్ణయాలు రూల్స్‌కు అనుగుణంగా ఉంటే...సంబంధిత శాఖ కార్యదర్శి వాటిని అమలు చేయాల్సి ఉంటుంది. ఒకవేళ విరుద్ధంగా ఉంటే మాత్రం సరైన సలహాలు ఇచ్చి సవరించుకునే విధానాన్ని వివరించాలి. ఇక్కడే మంత్రి కొండా సురేఖకు, తన శాఖ పరిధిలోని ఓ ముఖ్య కార్యదర్శి మధ్య విబేధాలు తారా స్థాయికి చేరుకున్నట్లు సమాచారం.
Balkampet Yellamma : హైదరాబాద్ బల్కంపేట్‌లోని మహిమాన్విత ఎల్లమ్మ తల్లి కల్యాణోత్సవం ఇవాళ అంగరంగ వైభవంగా ప్రారంభం కానుంది. మూడు రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాల కోసం ఆలయ అధికారులు సమగ్ర ఏర్పాట్లు పూర్తి చేశారు. ఉత్సవాల్లో భాగంగా సోమవారం మొదటి రోజు అమ్మవారిని పెళ్లికూతురిలా అలంకరించి, పుట్ట మన్నుతో ఎస్ఆర్ నగర్ వేంకటేశ్వర స్వామి ఆలయం నుంచి బల్కంపేట్ ఎల్లమ్మ ఆలయం వరకు ఊరేగింపు జరిపారు. ఈ వేడుకను భక్తులు భారీ సంఖ్యలో తిలకించారు.…
ఓరుగల్లు కాంగ్రెస్లో అంతర్గత పోరు... ఇప్పుడు వీధికెక్కింది. అది ఏ రేంజ్లో అంటే....చివరికి రాష్ట్ర నాయకత్వాన్ని కూడా సవాల్ చేసేంతలా. దీని గురించే ఇప్పుడు కాంగ్రెస్ సర్కిల్స్లో రకరకాల గుసగుసలు వినిపిస్తున్నాయి. పార్టీ రాష్ట్ర ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ వచ్చిన కొత్తలో... క్రమశిక్షణ ముఖ్యం, ఉల్లంఘన ఎక్కడ జరిగినా ఉపేక్షించేది లేదంటూ... చాలా గొప్పగా చెప్పేశారు.
Konda Murali: వరంగల్ నగరంలోని వైశ్య భవన్ లో ఆర్యవైశ్య సంఘం సభ్యులు, సంఘం నాయకులు తమ డబ్బులను గోల్మాల్ చేశారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. తమకు న్యాయం జరగాలంటూ సభ్యులు మాజీ ఎమ్మెల్సీ కొండా మురళిని ప్రత్యేకంగా ఆహ్వానించారు. సభ్యుల ఆహ్వానంతో కార్యక్రమానికి హాజరైన కొండా మురళి సమస్యలను పరిష్కరిస్తానని, అలాగే అనేక విషయాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. Read Also:Gang Rape Case: “అంతా ప్లాన్ ప్రకారమే”.. కోల్కతా గ్యాంగ్ రేప్ కేసులో సంచలన…