Revanth Reddy: తెలంగాణలో పర్యావరణ పరిరక్షణ కోసం ఓ అడుగు ముందుకేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు ‘వన మహోత్సవం’ కార్యక్రమాన్ని రాష్ట్ర రాజధానిలో ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన రాజేంద్రనగర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆవరణలో మొక్కలు నాటి, పర్యావరణాన్ని కాపాడేందుకు ప్రతిజ్ఞ చేశారు. అలాగే బొటానికల్ గార్డెన్స్ లో రుద్రాక్ష మొక్కను నాటారు. ఈ కార్యక్రమంలో మంత్రి కొండా సురేఖ, పలు ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.
Read Also:Mulugu: ములుగు జిల్లాలో మంత్రుల పర్యటన.. మరోవైపు నిరసనలతో ఉద్రిక్తత
ఇక ఈ వన మహోత్సవ కార్యక్రమాన్ని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్‌ను సీఎం తిలకించారు. మొక్కల ప్రాముఖ్యతను తెలియజేస్తూ, పర్యావరణాన్ని కాపాడాలంటే ప్రతి ఒక్కరూ భాగస్వాములవ్వాలని ప్రజలను ఉద్దేశించి ఆయన పిలుపునిచ్చారు. ఈ ఏడాది ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా 18.03 కోట్ల మొక్కలు నాటాలని సంకల్పించిందని సీఎం మాట్లాడారు. తెలంగాణకు పచ్చని చీరను కప్పేందుకు మనందరం కలిసికట్టుగా కృషి చేయాలని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. పర్యావరణ పరిరక్షణ కోసం చేపట్టిన ఈ ఉద్యమంలో ప్రతి పౌరుడు ఓ మొక్క నాటి తన బాధ్యతను నిర్వర్తించాలని ఆయన పిలుపునిచ్చారు.
Read Also:Bhuvanagiri: అబార్షన్లకు అడ్డాగా మారిన భువనగిరి..? గాయత్రి ఆసుపత్రిపై SOT పోలీసుల సోదాలు..!