Bhatti Vikramarka: మమ్మల్ని అడవిలోకి పోనివ్వడం లేదని ఆదివాసీయులు భట్టి విక్రమార్కకు వారి ఆవేదనను వ్యక్తం చేశారు. ఆరవ రోజు భట్టి పాదయాత్ర సందర్భంగా కొమురం భీం జిల్లా బూసి మెట్టలో ఆదివాసీలతో భట్టి విక్రమార్క మాట్లాడారు. అడవి మనది.. అడవిపై హక్కులు మనవి.. మనల్ని ఆపేది ఎవ్వరు అంటూ భట్టి అన్నారు. మీ హక్కులను కాపాడతానని హామీ ఇచ్చారు. మీ వెనుక కాంగ్రెస్ పార్టీ ఉందని అన్నారు. వచ్చేది కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రభుత్వమే అని ధీమా వ్యక్తం చేశారు. అప్పుడు మీకందరికీ న్యాయం జరుగుతుందని భట్టి విక్రమార్క హామీ ఇచ్చారు.
Read also: Talasani Srinivas Yadav: తాడు బొంగరం లేని వాల్లంతా పేపర్ లీక్ పై మాట్లాడుతున్నారు
భట్టి తో ఆదివాసీలు మాట్లాడుతూ.. వారిని అడవిలోకి పోనివ్వడం లేదని, కాయలు, పండ్లు, తేనే, కుంకుడు కాయలు కూడా తెచ్చుకొనివ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. గత కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన భూమి పట్టాలు ఇచ్చిందని, కేసీఆర్ ప్రభుత్వం కొత్త పట్టా పాస్ బుక్కులు ఇవ్వడం లేదని అన్నారు. ధరణి ఆన్ లైన్ లో మా భూములు వివరాలు ఎక్కించడం లేదని, ధరణిలో పేరు లేకపోతే బతికి ఉన్నా చనిపోయినట్టే అంటూ వారి ఆవేదనను భట్టితో వివరించారు. బ్యాంక్ వాళ్లు లోన్లు కట్టాలని మమ్మల్ని వేధిస్తున్నారని, ఇండ్లు లేవు.. తినడానికి కూడా రేషన్ బియ్యం తప్ప ఏమీ ఇవ్వడం లేదని కన్నీరుపెట్టుకున్నారు. ఆ బియ్యం కూడా దొడ్డు బియ్యం మాత్రమే.. మీరే చూడండని చూపించి.. ఈ బియ్యంతో అన్నం ఎలా తినాలి అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. మాకు కనీసం బాత్ రూమ్ లు కూడా ఇవ్వలేదని, మహిళలకు చాలా ఇబ్బందిగా ఉందని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం 9 రకాల వస్తువులు ఇచ్చేది. ఇప్పుడు ఆ పరిస్థితి లేదన్నారు. కరెంట్ కూడా తీసేస్తున్నారని, ఎలా బతకాలని తెలిపారు. అడవిలోకి పోనివ్వడం లేదని ఆసిఫాబాద్ నియోజక వర్గం బూసిమెట్ట గ్రామం మహిళలు, ప్రజలు భట్టి విక్రమార్క కు మొర పెట్టుకున్నారు.
Indrakaran Reddy: బండి సంజయ్ మతిభ్రమించి మాట్లాడుతున్నారు