తమిళ అగ్ర కథానాయకుడు అజిత్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘వలిమై’. హెచ్.వినోద్ దర్శకత్వం వహిస్తున్నారు. యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ‘వలిమై’ చిత్రాన్ని బోనీకపూర్ నిర్మిస్తున్నారు. హ్యుమా కూరేషి హీరోయిన్ గా నటిస్తుండగా.. టాలీవుడ్ నటుడు కార్తికేయ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఇదిలావుంటే, ఇప్పటికే విడుదలైన పోస్టర్లను బట్టి చూస్తుంటే.. యాక్షన్ సినిమా అని తెలుస్తోన్నప్పటికీ.. మదర్ సెంటిమెంట్ కూడా ప్రధానంగా ఉండనుందట.. అంతేకాదు, సంగీత దర్శకుడు యువన్ శంకర్ రాజా ‘అమ్మ’పై ప్రత్యేకంగా స్వరపరిచిన ఓ పాట ఈ సినిమాలో హైలైట్ గా నిలువనుందని చిత్రయూనిట్ బలంగా నమ్ముతుందట. అతిత్వరలోనే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.