ప్రముఖ ఎంటర్టైన్మెంట్ వెబ్ పోర్టల్, ఆండ్రాయిడ్, ఐవోఎస్ యాప్ జ్యాపి చిత్ర నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టింది. జ్యాపి యాప్ ని రూపొందించిన ఉదయ్ కోలా, విజయ్ శేఖర్ అన్నే, కృష్ణ గొర్రెపాటి ‘జ్యాపి స్టూడియోస్’ పేరుతో నిర్మాణ సంస్థని స్థాపించారు. ప్రముఖ దర్శకుడు అనిల్ రావిపూడి, ‘జాతిరత్నాలు’ ఫేమ్ అనుదీప్, సీనియర్ ప్రొడ్యూసర్ కె. ఎల్. దామోదర్ ప్రసాద్, ఫిలిం ఛాంబర్ ప్రెసిడెంట్ కొల్లి రామక్రిష్ణ, రాజా రవీంద్ర తదితరులు ముఖ్య అతిధులుగా బ్యానర్ లాంచ్…
తెలుగు చలనచిత్ర వాణిజ్య మండలి అధ్యక్షులు నారాయణదాస్ కిషన్ దాస్ నారంగ్ గత డిసెంబర్ నుండి ఆరోగ్యపరమైన సమస్యలతో బాధపడుతున్నారు. సుదీర్ఘ అనారోగ్యంతో ఏప్రిల్ 19న ఆయన కన్నుమూశారు. దాంతో ఏప్రిల్ 27న ఫిలిమ్ ఛాంబర్ కార్యవర్గం సమావేశమైంది. ఛాంబర్ నియమ నిబంధనలను అనుసరించి, ఉపాధ్యక్షుడైన కొల్లి రామకృష్ణ (రిథమ డిజిటల్ థియేటర్స్ అధినేత)ను తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలి అధ్యక్షుడుగా ఎన్నుకొన్నారు. కొల్లి రామకృష్ణ పదవి కాలం ఈ యేడాది జూలై 31 వరకూ…