Kolleru: కొల్లేరుపై సుప్రీంకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. కొల్లేరు వన్యప్రాణుల అభయారణ్యంపై మరోసారి తనిఖీ జరపాలని “కేంద్ర సాధికార కమిటీ”కి జస్టిస్ బీఆర్ గవాయి ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. అయితే, కొల్లేరులో ప్రైవేటు భూములను నోటిఫై చేయడంపై సుప్రీంకోర్టును ప్రైవేటు మత్స్యకారులు సంఘం ఆశ్రయించిన విషయం విధితమే.
కైకలూరు ఎమ్మెల్యే కార్యాలయంలో కొల్లేరు నాయకులు, ప్రజలతో ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ సమావేశమయ్యారు. సుప్రీంకోర్టులో ఇంప్లీడ్ పిటిషన్‌ను పరిగణలోకి తీసుకున్న తరుణంలో కొల్లేరు నేతలు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ మాట్లాడారు. గడిచిన 25 ఏళ్ళ నుంచి పర్యావరణ వేత్తలు పర్యావరణం తప్ప మనుషుల గురించి పట్టించుకోవడం లేదన్నారు. కొల్లేరులో పక్షులు బతకాలి.. మనుషులు కూడా ముఖ్యమే అని తెలిపారు. మొదటి సారి ప్రజల మనుగడ గురించి హస్తినకు తెలియజేసిన ఘనత…
కొల్లేరు వాసులకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. దశాబ్దాలుగా ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కారానికి నోచుకుంటాయనే నమ్మకం పెరుగుతుంది. కొల్లేరు ప్రాంత జిరాయితీ భూముల యజమానులు దాఖలు చేసిన ఇంప్లీడ్ పిటిషన్‌పై సుప్రీంకోర్టు విచారణ జరిపింది. కొల్లేరు వివాదానికి కారణమవుతున్న అంశాలపై 12 వారాల్లో నివేదిక ఇవ్వాలని కేంద్ర సాధికార సంస్థకు అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. దీంతో దశాబ్దాలుగా తాము ఎదుర్కొంటున్న సమస్యలకి పరిష్కారం దొరుకుతుందనే ఆశతో కొల్లేరు వాసులు ఉన్నారు. కొల్లేరు ప్రాంతంలో 5వ కాంటూరు…
బుడమేరు ఉధృతంగా ప్రవహిస్తోంది.. బుడలేరు వరదకు దాదాపు 20 డ్రెయిన్ ల నుంచి వచ్చే వర్షం నీరు తోడు కావడంతో కొల్లేరు సరస్సులో నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది.. ఇప్పటికే ఏలూరు రూరల్ పరిధిలోని గుడివాకలంక, పత్తికోళ్లంక, మొండికోడు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోగా.. మండవల్లి గ్రామంలో పెనుమాకలంక, మణుగూరు వంటి 9 గ్రామాలకు రాకపోకలు బంద్ అయ్యాయి..
ఏలూరు జిల్లాలోని కొల్లేరులోకి వరద నీరు భారీగా పెరిగింది. వరద ప్రభావంతో కొవ్వాలంక, పెనుమాకులంక, నందిగామ లంక, మణుగూరు గ్రామాలు నీట మునిగాయి. మునిగిన గ్రామాలకు వెళ్లి ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ ప్రజల బాగోగులను తెలుసుకుంటున్నారు. కొల్లేరుకు పెరిగిన వరద ఉధృతి కారణంగా ముంపు గ్రామాల ప్రజలను అధికారులు పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు.