కొల్లాపూర్ నియోజకవర్గంలో స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగిన బర్రెలక్క అలియాస్ కర్నె శిరీషా ఓడిపోయారు. నిరుద్యోగ అభ్యర్థుల ప్రతినిధిగా అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచిన ఆమె పోస్టల్ బ్యాలెట్ లో ముందంజలో ఉన్నప్పటికీ ఫలితాలలో మాత్రం వెనక్కి పడిపోయారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్ అభ్యర్థి మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు గెలిచారు.
Barrelakka Manifesto: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బర్రెలక్క సంచలనంగా మారుతోంది. ఎన్ని డిగ్రీలు చదివినా ప్రభుత్వ ఉద్యోగం రావడం లేదని.. అందుకే దృష్టి సారిస్తోందంటూ అప్పట్లో ఫేమస్ అయిన శిరీష అలియాస్ బర్రెలక్క వీడియో తీసింది.
Off The Record: కేసీఆర్ తొలి కేబినెట్‌లో మంత్రిగా పని చేసిన జూపల్లి కృష్ణారావును బీఆర్‌ఎస్ నుంచి బహిష్కరించడంతో కొల్లాపూర్ పొలిటికల్ లీడర్స్ ఒక్కసారిగా అటెన్షన్ మోడ్‌లోకి వచ్చారు. ఈ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వరుస విజయాలను సొంతం చేసుకున్న జూపల్లి 2018 ఎన్నికల్లో మొదటిసారి ఓడిపోయారు. ఆయనపై కాంగ్రెస్ నుంచి గెలిచిన బీరం హర్షవర్థన్‌రెడ్డి… మారిన రాజకీయ పరిణామాలతో గులాబీ గూటికి చేరారు. దీంతో ఇద్దరి మధ్య వర్గపోరు మొదలైంది. జూపల్లి , హర్షవర్దన్ రెడ్డి…
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ నేడు కొల్లాపూర్‌లో పర్యటించనున్నారు. బీజేపీ నాగర్ కర్నూల్ జిల్లా అధ్యక్షుడు, కొల్లాపూర్ నియోజకవర్గ ఇన్ చార్జి ఎల్లేని సుధాకర్ రావు ఆధ్వర్యంలో కొల్లాపూర్ ప్రాంత అభివృద్ధి కోసం గత నెల 8వ తేదీ నుంచి పాదయాత్ర చేపట్టిన విషయం తెలిసిందే.
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనుల్లో అపశృతి చోటుచేసుకున్నది. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులో భాగంగా కొల్లాపూర్ మండలం ఏలూరు శివార్లలోని రేగమనగడ్డ వద్ద ప్రమాదం చోటుచేసుకున్నది. పాలమూరు-రంగారెడ్డి ప్యాకేజీ వన్‌లో రేగమనగడ్డ వద్ద పంపు హౌస్‌ను నిర్మిస్తున్న క్రమంలో కార్మికులు క్రేన్ సహాయంతో పంపు హౌస్‌లోకి దిగుతున్నారు. దీంతో ఒక్కసారిగా క్రేన్ వైరు తెగిపోయింది. ఆక్రైన్ దిగుతున్న కార్మికులపై పడటంతో.. దీంతో.. ఐదుగురు కార్మికులు అక్కడికక్కడే మృతిచెందగా.. మరొక కార్మికునికి తీగ్రంగా గాయలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి…
నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ పట్టణంలో నేడు (శనివారం) ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ పర్యటించనున్నారు. ఎమ్మెల్యేగా బీరం హర్షవర్ధన్‌రెడ్డి ఎన్నికైన తరువాత మంత్రి కేటీఆర్ తొలిసారిగా కొల్లాపూర్ పట్టణానికి రానున్నారు. ఉదయం 9 గంటలకు బేగంపేట ఎయిర్‌పోర్ట్ నుంచి హెలీక్యాప్టర్‌లో బయలుదేరి 10 గంటలకు కొల్లాపూర్ బస్ డిపో సమీపంలోని అయ్య ప్ప ఆలయం ఆవరణలో ఏర్పాటు చేసిన హెలీప్యాడ్‌కు చేరుకుంటారు. ముందుగా పట్టణంలో రూ.170 కోట్లతో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులకు మంత్రి…
రాబోయే ఏడాది మళ్ళీ ఎన్నికల సంరంభం ప్రారంభం కానుంది. కానీ గులాబీ నేతలు మాత్రం తమ మధ్య విభేదాలు వీడడం లేదు. పెద్దబాస్, చిన్నబాస్ ఎన్ని చెప్పినా ప్రగతిభవన్ లో విని వదిలేస్తున్నట్టు అనిపిస్తోంది. మొన్నటి వరకు రాజకీయంగా మాటల తూటాలు పేల్చుకున్న కొల్లాపూర్ నేతలు , ఇప్పుడు వ్యక్తిగత విమర్శలతో దూషించుకుంటున్నారు. ఇదంతా అధికార విపక్ష పార్టీ నేతల మధ్య అనుకుంటే మీ బిర్యానీలో కాలేసినట్టే. ఈ సీన్ అంతా అధికార టీఆర్ఎస్ లోనే కొనసాగుతుండటంతో…