ఒక్క ఓటమితో పొలిటికల్ తెరపైనుంచి కనుమరుగయ్యారు ఆ మాజీ మంత్రి. ఇప్పుడు భవిష్యత్ ఏంటో తెలియడం లేదట. ఉన్నచోటే అవమానాలను భరించాలా? లేక పాతచోటుకు వెళ్లాలో తేల్చుకోలేకపోతున్నారు ఆ మాజీ మంత్రి. పొలిటికల్ జంక్షన్‌లో నిలుచుని అటూ ఇటూ దిక్కులు చూస్తున్న ఆ నాయకుడు ఎవరు? ఏమా కథ? కొల్లాపూర్‌లో జూపల్లి ఉనికి ప్రమాదంలో పడిందా?జూపల్లి కృష్ణారావు. ఉమ్మడి రాష్ట్రంతోపాటు తెలంగాణలోనూ మంత్రిగా పనిచేశారు. మహబూబ్‌నగర్ జిల్లాలోని కొల్లాపూర్ నుంచి వరసగా ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. గడిచిన…